Kishan Reddy fires on Kharge's comments: "What is a small war?"

ఖర్గే వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఫైర్: ‘‘ఏది చిన్న యుద్ధం?’’

Homeజాతీయం

ఖర్గే వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఫైర్: ‘‘ఏది చిన్న యుద్ధం?’’

న్యూఢిల్లీ, మే 21 – జమ్మూకాశ్మీర్‌లో ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి భారత ఆర్మీ ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంద

భారత్‌పై మరోసారి దాడికి తెగబడ్డ పాక్‌….
ఆపరేషన్ సింధూర్: భారత్ దిమ్మతిరిగే ప్రతీకారం..
రాష్ట్రపతితో CDS, త్రివిధ దళాధిపతులు భేటీ..

న్యూఢిల్లీ, మే 21 – జమ్మూకాశ్మీర్‌లో ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి భారత ఆర్మీ ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. ఈ దాడిలో పాకిస్తాన్‌కి చెందిన ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన ఈ ఆపరేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ భారత్ సైనిక శక్తిని చాటిన ఘట్టంగా అభివర్ణించారు.
అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయం పెంచాయి. ఖర్గే ఆపరేషన్ సిందూర్‌ను ‘‘చిన్న యుద్ధం’’గా అభివర్ణించడమే కాకుండా, దాడికి మోదీకి ముందే సమాచారం ఉండిందని ఆరోపించారు. దీంతో బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు.
ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖర్గే వ్యాఖ్యలను ధ్వజమెత్తారు. ‘‘9 ఉగ్రవాద స్థావరాలపై దాడి, 11 పాకిస్తాన్ మిలటరీ బేస్‌లు ధ్వంసం, అత్యాధునిక రాడార్, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను భారత మిసైళ్లతో నాశనం చేయడం… ఇవన్నీ చిన్న యుద్ధమా?’’ అంటూ ప్రశ్నించారు.
ఖర్గే మాటలతో సైనికుల గౌరవాన్ని తక్కువ చేస్తుండడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ‘‘ఆపరేషన్ సిందూర్ విజయాన్ని దేశం మొత్తం ప్రశంసిస్తే, కాంగ్రెస్ మాత్రం ఎందుకు తలదించుకుంటోంది?’’ అని విమర్శించారు. ఆర్మీ విజయాలను కూడా హర్షించలేకపోతున్న పరిస్థితి కాంగ్రెస్ దివాళాకోరుతనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

websoft – Dp Infra Marketing youtube Video

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube