ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న తప్పుడు సమాచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది,అధికారిక వర్గాల ద్వారా వచ్చ
ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న తప్పుడు సమాచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది,అధికారిక వర్గాల ద్వారా వచ్చే సమాచారాన్నే నమ్మాలని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో అనేక తప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌పై దాడి చేయడానికి అమెరికా భారతదేశంలోని పోర్టులను ఉపయోగిస్తోందన్న ప్రచారం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ ఆరోపణలపై భారత ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
అమెరికా సైన్యంలో మాజీ కల్నల్‌గా పనిచేసిన డగ్లస్ మెక్‌గ్రెగర్ ఒక అమెరికన్ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైనిక స్థావరాలు దెబ్బతిన్నందున సమీపంలోని భారత నౌకాదళ స్థావరాలను వినియోగించుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ప్రజల్లో ఆందోళనకు కారణమయ్యాయి.
అయితే ఈ ఆరోపణలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పూర్తిగా ఖండించింది. విదేశాంగ శాఖ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ (X) వేదికగా స్పందిస్తూ ఈ ప్రచారం పూర్తిగా తప్పుడు మరియు ఆధారరహితమని తెలిపింది. భారతదేశంలోని పోర్టులను అమెరికా ఇరాన్‌పై దాడి చేయడానికి ఉపయోగిస్తోందన్న వార్తలు అసత్యమని స్పష్టం చేసింది. ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కూడా హెచ్చరించింది.
ఇదిలా ఉండగా హిందూ మహాసముద్రంలో ఇరాన్‌కు చెందిన యుద్ధ నౌకపై జరిగిన దాడి నేపథ్యంలో ఈ ప్రచారం మరింత వేగంగా వ్యాపించింది. ఐరిస్ దేనా-75 అనే యుద్ధ నౌకపై అమెరికా జలాంతర్గామి దాడి చేసి ముంచివేసినట్లు సమాచారం. ఈ ఘటన జరిగిన సమయంలో నౌకలో సుమారు 180 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో కొందరిని శ్రీలంక సైన్యం రక్షించగా, ఇప్పటివరకు 87 మంది మృతదేహాలను గుర్తించినట్లు సమాచారం. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నౌక విశాఖపట్నం నుంచి బయలుదేరి వెళ్తుండగా శ్రీలంక తీర ప్రాంతానికి సమీపంలో ఈ దాడి జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి.
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews
ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime Newsతో కలసి ఉండండి!

COMMENTS