ఆన్‌లైన్ టికెట్ల స్కామ్: క్యూఆర్ కోడ్ తో రూ.10,500 పోగొట్టుకున్న యువకుడు హైదరాబాద్: నగరంలో ఆన్‌లైన్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. బంజారాహిల్స్ ప్రాం
ఆన్‌లైన్ టికెట్ల స్కామ్: క్యూఆర్ కోడ్ తో రూ.10,500 పోగొట్టుకున్న యువకుడు
హైదరాబాద్: నగరంలో ఆన్‌లైన్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన రణబీర్ బగ్గా అనే యువకుడు సితార్ ప్లేయర్ రిషబ్ రికీ రామశర్మ ఈవెంట్ టికెట్ల విషయంలో సైబర్ మోసానికి గురయ్యాడు. కొద్దిరోజుల క్రితం నోవాటెల్ హోటల్లో జరిగిన ఈవెంట్ టికెట్లు ఇప్పిస్తానంటూ వాట్సాప్ ద్వారా అతన్ని సంప్రదించిన ఓ వ్యక్తి, టికెట్ల కోసం రూ.10,500 పంపాలని క్యూఆర్ కోడ్ పంపించాడు.
రణబీర్ ఆ నంబర్‌కు డబ్బులు పంపిన తర్వాత, సదరు వ్యక్తి స్పందించకపోవడంతో తాను మోసపోయానని గ్రహించాడు. వెంటనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఇలాంటి మెసేజ్‌ల పట్ల, ముఖ్యంగా క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు పంపమని కోరితే జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

COMMENTS