వేసవిలో మీ పిల్లల ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! వేసవి వేడికి పిల్లల్లో ఆకలి తగ్గడం, త్వరగా నీరసపడిపోవడం సహజం. డీహైడ్రేషన్, పెరిగిన ఉష్ణోగ్రతల
వేసవిలో మీ పిల్లల ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
వేసవి వేడికి పిల్లల్లో ఆకలి తగ్గడం, త్వరగా నీరసపడిపోవడం సహజం. డీహైడ్రేషన్, పెరిగిన ఉష్ణోగ్రతలు, జీర్ణక్రియ మందగించడం వంటివి దీనికి కారణాలు. ఇలా జరగకుండా ఉండాలంటే ఈ సూచనలు పాటించండి:
సులభంగా జీర్ణమయ్యే ఆహారం: పిల్లలకు తేలికగా అరిగే ఫుడ్స్ ఇవ్వండి.
ఎక్కువ ద్రవాలు: జ్యూసులు, జావలు, కొబ్బరి నీళ్లు వంటివి తరచుగా ఇస్తూ ఉండండి. డీహైడ్రేషన్ కాకుండా చూసుకోండి. ఇల్లు చల్లగా ఉంచండి: ఇంట్లో వాతావరణం కూల్ గా ఉండేలా చూసుకోవడం ముఖ్యం.
తగినంత విశ్రాంతి: పిల్లలు బాగా నిద్రపోవడం, విశ్రాంతి తీసుకోవడం అవసరం.
ఈ జాగ్రత్తలతో మీ చిన్నారులు వేసవిలో కూడా యాక్టీవ్ గా, ఆరోగ్యంగా ఉంటారు!

COMMENTS