Telangana Cabinet Reshuffle: Who Could Get Minister Berths?

తెలంగాణ కేబినెట్‌లోకి కొత్త ముఖాలు.. మంత్రి పదవులు వీరికేనా?

Homeతెలంగాణ

తెలంగాణ కేబినెట్‌లోకి కొత్త ముఖాలు.. మంత్రి పదవులు వీరికేనా?

తెలంగాణ కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్‌లో ఉత్కంఠ. కొండా సురేఖపై చర్యలు, ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవుల భర్తీపై చర్చలు. తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రివర్గ

కొండా సురేఖపై చర్యలకు రంగం సిద్ధం.. క్రమశిక్షణ కమిటీ నివేదిక రెడీ!
కొండా సురేఖ క్షమాపణలు.. నాగార్జున సంచలన నిర్ణయం.
కొండా సురేఖపై ఒత్తిడి.. రాజీనామా చేయించే దిశగా కాంగ్రెస్‌లో మంతనాలు?

తెలంగాణ కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్‌లో ఉత్కంఠ. కొండా సురేఖపై చర్యలు, ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవుల భర్తీపై చర్చలు.

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రివర్గ మార్పులు, విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు కీలక నేతలు ఢిల్లీలో పార్టీ అధిష్ఠానంతో సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కేబినెట్‌లో మార్పులపై చర్చ మళ్లీ వేడెక్కింది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ వ్యవహారం, కొందరు మంత్రుల పనితీరు, ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవుల భర్తీ, సామాజిక వర్గాల వారీగా ప్రాతినిధ్యం వంటి అంశాలు అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఢిల్లీలో అధిష్ఠానంతో కీలక చర్చలు

సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు కొండా సురేఖ కూడా ఢిల్లీలో ఉండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో సీఎం పార్టీ కేంద్ర నాయకత్వంతో కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహేశ్‌కుమార్ గౌడ్ తదితర నేతలతోనూ అధిష్ఠానం సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కొండా సురేఖ స్థానంలో ఎవరికి ఛాన్స్?

కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఆమెను కేబినెట్ నుంచి తప్పిస్తే ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనే అంశం ఆసక్తికరంగా మారింది. అదే సామాజిక వర్గానికి చెందిన నేతకు అవకాశం ఇవ్వాల్సి వస్తే ప్రస్తుతం ప్రభుత్వ విప్‌గా ఉన్న ఆది శ్రీనివాస్ పేరును పరిశీలించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే సురేఖపై తుది నిర్ణయం, ఆమె పదవిపై చర్యల విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

లంబాడా వర్గానికి మంత్రి పదవి?

కేబినెట్‌లో ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవుల్లో ఒకదాన్ని లంబాడా వర్గానికి కేటాయించాలనే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. ఈ స్థానానికి బాలూనాయక్, రామచంద్రునాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో మంత్రి పదవికి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో సుదర్శన్‌రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

రాజగోపాల్ రెడ్డి, గడ్డం ప్రసాద్ పేర్లు

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి కోసం ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న నేపథ్యంలో ఇద్దరు సోదరులకు ఒకేసారి కేబినెట్‌లో చోటు కల్పించే విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేరు కూడా మంత్రి పదవి రేసులో వినిపిస్తోంది. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటే ప్రస్తుత మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు స్పీకర్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది.

అయితే ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లు, మార్పులపై జరుగుతున్న చర్చలు అధికారికంగా ఖరారు కాలేదు. కేబినెట్ విస్తరణ, మార్పులపై కాంగ్రెస్ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. శాసనసభ సమావేశాల అనంతరం ఈ వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణకు వాతావరణశాఖ చల్లని కబురు.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

వైద్యులపై దాడుల కేసులో సుప్రీంకోర్టు సీరియస్.. బెయిల్‌పై కీలక వ్యాఖ్యలు

HBD Pawan Kalyan: పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Instagram: DigitalPrimeNews
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews

 

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube