భూ భారతి చట్టం 2025: 5 వేల మంది సర్వేయర్లకు శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం భూమి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి రెవె
భూ భారతి చట్టం 2025: 5 వేల మంది సర్వేయర్లకు శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
భూమి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి రెవెన్యూ చట్టం 2025లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 5 వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఉంటుందని ఆమె గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు ఈ నెల 17 లోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
COMMENTS