తెలంగాణలో రైతుల భూములకు సంబంధించి రెవెన్యూ సర్వేలను అధికారులే గ్రామాల్లోకి వచ్చి చేస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం న
తెలంగాణలో రైతుల భూములకు సంబంధించి రెవెన్యూ సర్వేలను అధికారులే గ్రామాల్లోకి వచ్చి చేస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామంలో ఈ సర్వేలు ప్రారంభమవుతాయని తెలిపారు.
రైతులు ఇకపై భూమికి సంబంధించిన సమస్యల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని మంత్రి స్పష్టం చేశారు. “ప్రతి రైతు భూమికి ప్రత్యేకమైన భూధార్ నంబర్ ఇస్తాం. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామపాలన అధికారిని నియమించబోతున్నాం. ఇందుకోసం మొత్తం 3,556 మంది అధికారులను నియమించనున్నాం,” అని చెప్పారు.
ఇకపై రెవెన్యూ అధికారులు రైతుల భూములకు కాపలాదారులుగా ఉంటారని మంత్రి తెలిపారు. ఈ చర్యల ద్వారా భూమి వివాదాలు తగ్గి రైతులకు స్పష్టమైన హక్కులు లభించనున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

COMMENTS