భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ఐపీఎల్ కొనసాగింపుపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ప్రకటన! ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న
భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ఐపీఎల్ కొనసాగింపుపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ప్రకటన!
ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో, ఐపీఎల్ 2025 నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. గురువారం ధర్మశాలలో జరగాల్సిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సరిహద్దుల్లో పాకిస్తాన్ దాడులు, భద్రతా కారణాలతో మధ్యలోనే రద్దయింది.
ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ను కొనసాగించాలా లేదా అనే చర్చ జరుగుతున్నప్పటికీ, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతానికి ఐపీఎల్ యథావిధిగా కొనసాగుతుందని ఆయన తెలిపారు. పరిస్థితులు వేగంగా మారుతున్నాయని అంగీకరించిన ధుమాల్, కేంద్ర ప్రభుత్వం నుంచి ఐపీఎల్‌ను నిలిపివేయమని తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని స్పష్టం చేశారు. ఒకవేళ కేంద్రం నుంచి ఆదేశాలు వస్తే వెంటనే లీగ్‌ను నిలిపివేస్తామని పేర్కొన్నారు.
రద్దైన ధర్మశాల మ్యాచ్‌లో పాల్గొన్న ఆటగాళ్లను, సిబ్బందిని సురక్షితంగా ఢిల్లీకి తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు, ప్రత్యేక రైలులో వారిని తరలిస్తున్నట్లు తెలిపారు. అలాగే, శుక్రవారం బెంగళూరులో జరగాల్సిన ఆర్‌సిబి vs లక్నో మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని అరుణ్ ధుమాల్ వెల్లడించారు.

COMMENTS