హైదరాబాద్ నగరంలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి పనులు వేగంగా సాగుతున్నాయి. మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులపై అధికారులు క్షేత్రస్థాయి
హైదరాబాద్ నగరంలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి పనులు వేగంగా సాగుతున్నాయి. మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులపై అధికారులు క్షేత్రస్థాయి విచారణ నిర్వహిస్తున్నారు. అర్హులైన వారికి కొత్త కార్డులను మంజూరు చేస్తుండగా, అనర్హుల దరఖాస్తులను తిరస్కరించారు. ఇప్పటివరకు దాదాపు 83,285 మంది అర్హులుగా గుర్తించగా, సుమారు 2 లక్షల దరఖాస్తులు వచ్చాయని పౌరసరఫరాల శాఖ తెలిపింది.
ఈ నెల 24వ తేదీ వరకు మంజూరైన కార్డులకు రేషన్ కోటా కేటాయించబడింది. అధికంగా దరఖాస్తులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలనుంచి వచ్చాయి. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు, రేషన్ కార్డు లేనివారు ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం.
ఇక వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి ఆమోదం తెలపడంతో, సివిల్ సప్లై అధికారులు అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించారు.
websoft digital media – youtube video

COMMENTS