Nakashatra Agency అమ్రాబాద్‌లో ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’ ప్రారంభం – గిరిజన రైతులకు సూర్యశక్తి ఆధారిత నీటి సౌకర్యం నాగర్ కర్నూల్ జిల్లా, మే 19
అమ్రాబాద్‌లో ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’ ప్రారంభం – గిరిజన రైతులకు సూర్యశక్తి ఆధారిత నీటి సౌకర్యం
నాగర్ కర్నూల్ జిల్లా, మే 19 (తెలంగాణ వార్తలు):
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఈ పథకం ద్వారా విద్యుత్ లేని పోడు భూముల్లో గిరిజన రైతులకు సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసి సాగునీటిని అందించనున్నారు. మొత్తం 6 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఈ పథకం అమలుకానుంది.
RoFR (అటవీ హక్కుల చట్టం – 2006) ప్రకారం భూములను కలిగి ఉన్న గిరిజన రైతులు ఈ పథకానికి అర్హులుగా పరిగణించబోతున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా గిరిజన రైతుల సాగు భూముల్లో నీటి సౌకర్యం మెరుగవుతుంది. ఇది ఒక వినూత్న గ్రామీణ సాగు అభివృద్ధి చర్యగా భావించబడుతోంది.
COMMENTS