రాజీవ్ యువ వికాసం ప్రారంభం వాయిదా….. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

రాజీవ్ యువ వికాసం ప్రారంభం వాయిదా…..

Homeతెలంగాణ

రాజీవ్ యువ వికాసం ప్రారంభం వాయిదా…..

అనర్హులకు లబ్ధి చేకూరకుండానే అమలు లక్ష్యం హైదరాబాద్: నేడు ప్రారంభమవాల్సిన రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభాన్ని తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేసింది. దరఖాస

తెలంగాణలో ఘనంగా ప్రారంభమైన శ్రీ సరస్వతి పుష్కరాలు…
నేడు కొత్త పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్….
డ్రాపౌట్ సీఎం..! బీజేపీ నుంచి తప్పుదారి…..

అనర్హులకు లబ్ధి చేకూరకుండానే అమలు లక్ష్యం
హైదరాబాద్: నేడు ప్రారంభమవాల్సిన రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభాన్ని తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేసింది. దరఖాస్తులను మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని మంత్రుల బృందం నివేదికలో పేర్కొంది. దీనిని సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు.
పకడ్బందీగా అమలుకు సీఎం దిశానిర్దేశం.
అనర్హులకు ఒక్కరికి కూడా లబ్ధి చేకూరకూడదని, పకడ్బందీగా వ్యవహరించాలి అని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
క్యాబినెట్ చర్చ అనంతరం ముందుకు.
రాజీవ్ యువ వికాసంపై మరింత స్పష్టత కోసం క్యాబినెట్‌లో చర్చించాకే తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. యువతకు ప్రయోజనం చేకూర్చేలా పూర్తిస్థాయిలో పథకాన్ని అమలు చేసేలా ప్రణాళిక రూపొందించనున్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube