జహీరాబాద్‌లో సీఎం పర్యటనకు ఏర్పాట్లు… - Digital Prime News - Latest Telugu News Digital Prime News

జహీరాబాద్‌లో సీఎం పర్యటనకు ఏర్పాట్లు…

Homeతెలంగాణ

జహీరాబాద్‌లో సీఎం పర్యటనకు ఏర్పాట్లు…

జహీరాబాద్‌, మే 20 – సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మరియు ఝరాసంగం మండలాల్లో మే 23న జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున

రాజీవ్ యువ వికాసం ప్రారంభం వాయిదా…..
సీఎం రేవంత్‌రెడ్డి నేటి షెడ్యూల్ వివరాలు….
నేడు కొత్త పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్….

జహీరాబాద్‌, మే 20 – సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మరియు ఝరాసంగం మండలాల్లో మే 23న జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. పర్యటనలో భాగంగా నిమ్జ్‌ ప్రాజెక్టు ప్రత్యేక రోడ్డుకు, జహీరాబాద్‌ పట్టణ సమీపంలోని హుగ్గెలి చౌరస్తాలో బసవేశ్వర విగ్రహావిష్కరణకు, అలాగే ఈద్గా సమీపంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్ శంకుస్థాపనకు సీఎం రేవంత్ హాజరుకానున్నారు.
పర్యటన విజయవంతం కావడంపై జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు విభాగం సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నారు. హెలిప్యాడ్‌, బహిరంగ సభ స్థలాల వద్ద సురక్షితత, శుభ్రత, రోడ్లకు కలరింగ్, ముళ్లపొదల తొలగింపు వంటి పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఎస్పీ పరితోష్ పంకజ్ స్వయంగా పర్యటన మార్గాన్ని పరిశీలించారు. పటిష్ఠ బందోబస్తు కోసం స్థానిక పోలీసులతో పాటు స్పెషల్ బ్రాంచ్‌, ఇంటలిజెన్స్ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టారు.

websoft – DP Infra Marketing instagram shorts

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube