తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జూన్ 5న ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర పరిపాలనకు సంబంధించి ప
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జూన్ 5న ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర పరిపాలనకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
కేబినెట్ అజెండాలో ప్రధానంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ‘రాజీవ్ యువవికాసం’ పేరుతో యువత అభివృద్ధికి తీసుకురానున్న కొత్త పథకం, వానాకాలం పంటల సాగుకు కావలసిన చర్యలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు, భూ భారతిపై సమీక్ష, కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ నివేదిక, NDSA నివేదికలపై విశ్లేషణ వంటివి ఉన్నాయి.
అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కమిటీ ఇచ్చిన నివేదికను కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఉద్యోగుల సంక్షేమం, వేతనాలు, ప్రమోషన్లు తదితర అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.
ఈ సమావేశం రాష్ట్ర పాలనలో కీలక మలుపుగా మారనుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. వ్యవసాయం, సంక్షేమం, గృహ నిర్మాణం వంటి రంగాల్లో ఇప్పటికే ప్రారంభించిన పథకాల పురోగతిపై కూడా సమీక్ష చేపట్టనున్నారు.

COMMENTS