భద్రతా సంస్థలు పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్‌లను విడుదల చేశాయి. వారిని ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా మరియు అబు తల్హాగా గుర్తించారు.
భద్రతా సంస్థలు పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్‌లను విడుదల చేశాయి. వారిని ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా మరియు అబు తల్హాగా గుర్తించారు. వారి కోసం విస్తృతమైన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దాడికి లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత వహించినట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారులు ఈ ముగ్గురితో పాటు మరికొంతమంది ఉగ్రవాదులు కూడా ఈ దాడిలో పాల్గొని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసి, ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

COMMENTS