Trump In Egypt: భారత్, పాక్‌లపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలుషర్మ్ ఎల్-షేక్, అక్టోబర్ 14: ఈజిప్టులో జరిగిన పాలస్తీనా–హమాస్ శాంతి ఒప్పంద కార్యక్రమంలో అమెరికా
Trump In Egypt: భారత్, పాక్‌లపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
షర్మ్ ఎల్-షేక్, అక్టోబర్ 14: ఈజిప్టులో జరిగిన పాలస్తీనా–హమాస్ శాంతి ఒప్పంద కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సందర్భంగా ట్రంప్ భారత్, పాకిస్థాన్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరుగు పొరుగు దేశాలైన భారత్, పాకిస్థాన్‌లు కలిసి మెలిసి జీవిస్తాయని తాను విశ్వసిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కూడా ట్రంప్ ప్రశంసలు కురిపించారు. “భారతదేశం ఒక గొప్ప దేశం. ఆ దేశంలో నాకు అత్యున్నత స్థాయిలో మంచి స్నేహితుడు ఉన్నారు. ఆయన తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు,” అని ట్రంప్ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యల్లో ఆయన మోదీ పేరు నేరుగా ప్రస్తావించకపోవడం గమనార్హం.
ట్రంప్ తన పక్కనే ఉన్న పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వైపు చూస్తూ ఈ వ్యాఖ్యలు చేయగా, షరీఫ్ నవ్వుతూ స్పందించారు. అంతకుముందు కూడా ట్రంప్ పాక్ నాయకులను ప్రశంసించారు. ఈ సందర్భంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ, “ట్రంప్ చేసిన అవిశ్రాంత కృషి వల్లే మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొంది. లక్షలాది మంది ప్రాణాలను ఆయన కాపాడారు. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ మళ్లీ నామినేట్ కావాలి,” అని పేర్కొన్నారు.
అంతకు ముందు పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్–పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పలు యుద్ధాలను తాను ఆపానని ట్రంప్ పలుసార్లు వ్యాఖ్యానించారు. అయితే ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి వెనెజులా ప్రతిపక్ష నేత మరియా కొరినా మడోచ్ ఎంపిక కావడంతో ట్రంప్ ఆశలు ఫలించలేదు.

COMMENTS