తప్పుడు అఫిడవిట్‌లు: గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టు షాక్! తెలంగాణ గ్రూప్-1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ పిటిషన్ వేసిన 19 మంది అభ్యర్థులకు హైకోర్
తప్పుడు అఫిడవిట్‌లు: గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టు షాక్!
తెలంగాణ గ్రూప్-1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ పిటిషన్ వేసిన 19 మంది అభ్యర్థులకు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. వీరు సమర్పించిన ప్రమాణ పత్రాలు తప్పు అని తేలడంతో ఒక్కొక్కరికి రూ. 20 వేల జరిమానా విధించింది. అంతేకాదు, వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా TGPSCని ఆదేశించింది.
పిటిషనర్లు తమ మెమోలో ఉన్న మార్కులకు, వెబ్‌సైట్‌లో ఉన్న మార్కులకు తేడాలున్నాయని కోర్టుకు తెలిపారు. రీవాల్యుయేషన్ చేసి మార్కులు పారదర్శకంగా వెల్లడించాలని కోరారు. అయితే, విచారణ సందర్భంగా TGPSC తరపు న్యాయవాది వారు తప్పుడు అఫిడవిట్‌లు దాఖలు చేశారని కోర్టుకు తెలియజేశారు.
జస్టిస్ నగేశ్ బీమపాక ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించారు. అభ్యర్థులు వాస్తవాలను దాచి, కోర్టును తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తీర్పు గ్రూప్-1 వివాదానికి కొత్త మలుపు తిప్పింది.

COMMENTS