సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అమృత్ భారత్ పథకం కింద చేపట్టిన ఈ అభివృద్ధిలో భాగంగా స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారను
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అమృత్ భారత్ పథకం కింద చేపట్టిన ఈ అభివృద్ధిలో భాగంగా స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. కొన్ని రైళ్లను తాత్కాలికంగా ఇతర స్టేషన్లకు మళ్లించిన విషయం తెలిసిందే. చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి పలు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.
అయితే.. వేసవికాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. మే, జూన్ నెలల్లో హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు మొత్తం 16 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శ్రీధర్ తెలిపారు. సికింద్రాబాద్ నుండి రామేశ్వరానికి (07695) మే 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ప్రతి బుధవారం ప్రత్యేక రైలు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో రామేశ్వరం నుండి సికింద్రాబాద్‌కు (07696) మే 9వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రతి శుక్రవారం ఈ ప్రత్యేక రైలు సేవలు అందిస్తుంది.

COMMENTS