మాజీ డీఎస్పీ నళిని సంచలన ఆరోపణలు – రేవంత్ రెడ్డిపై సజీవ సమాధి హెచ్చరిక

మాజీ డీఎస్పీ నళిని సంచలన ఆరోపణలు – రేవంత్ రెడ్డిపై సజీవ సమాధి హెచ్చరిక

Homeతెలంగాణ

మాజీ డీఎస్పీ నళిని సంచలన ఆరోపణలు – రేవంత్ రెడ్డిపై సజీవ సమాధి హెచ్చరిక

యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 26: మాజీ డీఎస్పీ దోమకొండ నళిని తన ఫేస్‌బుక్‌లో చేసిన తాజా పోస్ట్‌తో మరోసారి తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపారు. “చనిపోయిన

హైదరాబాద్‌లో విధుల్లో ఎస్సై సంజయ్ సావంత్ హఠాన్మరణం
హైదరాబాద్‌లో భారీ వర్షాలు – జీహెచ్ఎంసీ, ప్రభుత్వం అప్రమత్తం.
నెహ్రూ జూపార్క్‌కు సందర్శకుల రద్దీ…

యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 26: మాజీ డీఎస్పీ దోమకొండ నళిని తన ఫేస్‌బుక్‌లో చేసిన తాజా పోస్ట్‌తో మరోసారి తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపారు. “చనిపోయిన పాత నళినిని ఎక్యుమేషన్ చేసి బయటకు తీసి నా ప్రశాంత జీవితంలో సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ తుఫాన్ సృష్టించారు. నవమి నాటికి నా విషయం తేలకపోతే సజీవ సమాధి అవుతాను. నేను ఏ రకంగా చచ్చినా అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే” అని ఆమె స్పష్టం చేశారు.

నళిని తన దుస్థితికి తక్షణ కారణం సీఎంకే అని పేర్కొన్నారు. “రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. రాష్ట్రపతి మెడల్ కోసం కృషి చేస్తున్న సమయంలో నన్ను సస్పెండ్ చేసి వెంటాడటం జరిగింది. 21 నెలల క్రితం సీఎంకు సమర్పించిన రిపోర్ట్‌పై ఇంకా చర్య తీసుకోకపోవడం నాకు మరింత స్ట్రెస్ కలిగిస్తోంది. ఇదే నా చావుకు దారి తీస్తుందేమో” అని వాపోయారు.

నళిని తన రిపోర్ట్ సీఎం నుండి చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఓఎస్డీ, కలెక్టర్ వరకు వెళ్లి ఇప్పటివరకు నిర్ణయం రాకపోవడాన్ని ప్రస్తావించారు. “సంధ్యా థియేటర్ ఘటనలో మరణించిన కుటుంబాన్ని వారం రోజుల్లోనే ఆదుకున్న సీఎం నా విషయంలో సంవత్సరాల తరబడి ఆలస్యం చేస్తున్నారు. నా మరణ వాంగ్మూలాన్ని కలెక్టర్‌తో రికార్డ్ చేయించడమే తప్ప ఇంకేమీ చేయలేదు” అని విమర్శించారు.

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది. మరిన్ని తాజా రాజకీయ విశ్లేషణలు, కామెంటరీ కోసం మా వెబ్‌సైట్ మరియు యూట్యూబ్ చానెల్‌ను ఫాలో అవ్వండి.

Visit: www.digitalprimenews.in

Follow Us on Social Media:
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News on Facebook
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0
Follow by Email
YouTube
YouTube