AP SSC Results 2025 : విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్ 23వ తేదీన ఏపీ పదో తరగతి ఫలితాలు (AP 10th
AP SSC Results 2025 : విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్ 23వ తేదీన ఏపీ పదో తరగతి ఫలితాలు (AP 10th Results 2025) విడుదల చేశారు. ఈ ఫలితాలను ఏప్రిల్ 23న ఉదయం 10 గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) విడుదల చేశారు. ఈ ఏడాది 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు 6,19,275 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంగ్లిష్ మీడియంకు సంబంధించి 5,64,064 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. తెలుగు మీడియంలో 51,069 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇక ఫలితాలు విడుదలయ్యాక అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/ లేదా https://results.bse.ap.gov.in/ లేదా మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

COMMENTS