Tariffs Plus Penalty On India: భారత్‌పై 25 శాతం సుంకాలు, జరిమానా విధించిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై భారీ ఆర్థిక ద
Tariffs Plus Penalty On India: భారత్‌పై 25 శాతం సుంకాలు, జరిమానా విధించిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై భారీ ఆర్థిక దెబ్బతీశారు. ఆయన తాజాగా చేసిన ప్రకటన ప్రకారం, భారత్‌పై 25 శాతం దిగుమతి సుంకాలు (Tariffs) మరియు అదనంగా జరిమానా (Penalty) విధిస్తున్నట్టు తెలిపారు. ఈ ఆదేశాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టంచేశారు.
ట్రంప్ తన స్వంత సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ అయిన “ట్రూత్ సోషల్” (Truth Social) ద్వారా ఈ ప్రకటన చేశారు. భారత్‌ను మిత్ర దేశంగా అభివర్ణించినప్పటికీ, భారత వ్యాపార విధానాలను తీవ్రంగా విమర్శించారు.
ట్రంప్ వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి:
“గుర్తుంచుకోండి… భారతదేశం మన మిత్ర దేశమే అయినా, మేము వారితో తక్కువ వ్యాపారం చేస్తున్నాము. ఎందుకంటే వారి సుంకాలు చాలా అధికంగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను వారు విధిస్తున్నారు.
అంతేకాదు, భారత్ ద్రవ్యేతర వాణిజ్య విధానాలు చాలా కఠినంగా ఉన్నాయి. ఇంకా వారు ఎక్కువ భాగం సైనిక పరికరాలను రష్యా నుంచే కొనుగోలు చేస్తున్నారు. రష్యా ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తున్న సమయంలో, భారత్ రష్యా మరియు చైనాల నుండి పెద్ద మొత్తంలో ఎనర్జీ కొనుగోలు చేస్తోంది. ఇది అసంతృప్తికరమైన వ్యవహారం.
అందుకే, భారత్‌పై 25 శాతం దిగుమతి సుంకాలు విధిస్తున్నాము. అంతేకాక, అదనంగా జరిమానా కూడా ఉంటుంది. థ్యాంక్స్… మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్ (MAGA)!”
ట్రంప్ ఆగ్రహానికి కారణాలు ఏమిటి?
- భారత్ అత్యధిక దిగుమతి సుంకాలు విధించడాన్ని ట్రంప్ తప్పుపట్టారు
- రష్యా నుండి ఎక్కువ మిలిటరీ కొనుగోలు
- చైనా, రష్యా నుండి ఎనర్జీ దిగుమతులు
- అమెరికా వ్యాపారులకు నష్టాలు
ప్రభావం ఏంటి?
ఈ చర్యతో ఇండియాకు అమెరికా ఎగుమతులపై అధిక ఖర్చు పడనుంది. ముఖ్యంగా స్టీల్, అల్యూమినియం, ఆటో భాగాలు, టెక్ ప్రోడక్ట్స్‌పై ప్రభావం పడే అవకాశముంది. ఇది భారత-USA వ్యాపార సంబంధాలపై గణనీయంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.
మరిన్ని తాజా అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక వార్తల కోసం… మీ Digital Prime News ని ఫాలో అవ్వండి.
Visit: www.digitalprimenews.in
Follow Us on Social Media:
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News on Facebook
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS