ఏపీ లిక్కర్ స్కాం: ఛార్జిషీట్‌లో జగన్ పేరు ప్రస్తావన | 305 పేజీల నివేదిక దాఖలు చేసిన సిట్.

ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు – ఛార్జిషీట్‌లో జగన్ పేరు ప్రస్తావన.

Homeఆంధ్రప్రదేశ్

ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు – ఛార్జిషీట్‌లో జగన్ పేరు ప్రస్తావన.

ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు - ఛార్జిషీట్‌లో జగన్ పేరు ప్రస్తావన అమరావతి, జూలై 20 (డిజిటల్ ప్రైమ్ న్యూస్):ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపుతున్న లిక

ఆమరణ దీక్షకు దిగుతాం: షర్మిల హెచ్చరిక…
లోకేష్‌ ట్వీట్‌తో ఎన్టీఆర్‌కు భావపూర్వక నివాళి…
వైసీపీ నుంచి బీజేపీలో చేరిన జకియా ఖానం….

ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు – ఛార్జిషీట్‌లో జగన్ పేరు ప్రస్తావన

అమరావతి, జూలై 20 (డిజిటల్ ప్రైమ్ న్యూస్):
ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపుతున్న లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం, సిట్ అధికారులు 305 పేజీలతో కూడిన ప్రాథమిక ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. ముఖ్యంగా అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు పలుమార్లు ప్రస్తావించగా, ఆయనకు స్కాం గురించి తెలుసు అన్న అంశాన్ని సూటిగా చాట్ షీట్‌లో పేర్కొన్నారు.

అయితే, జగన్‌ను ప్రత్యక్ష నిందితుడిగా చేర్చకపోయినా, ఆయన అనుచరులే స్కాంలో ప్రధాన పాత్రధారులని వివరించారు. కొత్తగా మరో 8 మందిని నిందితులుగా చేర్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో మొత్తం 16 మంది వ్యక్తులు నిందితులుగా ఉన్నారు.

నూతనంగా చేర్చిన నిందితులు:

  1. సైమన్ ప్రసన్
  2. కొమ్మారెడ్డి అవినాష్
  3. అనిల్ రెడ్డి
  4. సుజల్ బెహ్రన్
  5. మోహన్
  6. రాజీవ్
  7. బొల్లారం శివ
  8. ముప్పిడి అవినాష్

సిట్ దర్యాప్తు వేగంగా సాగుతోంది

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, లిక్కర్ స్కాం పై దర్యాప్తు వేగం పుంజుకుంది. ఫిబ్రవరి 5న విజయవాడ పోలీస్ కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు కాగా, ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేశారు. ఇందులో రాజ్ కెసిరెడ్డి, ధనుంజయరెడ్డి, గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి తదితరులు ఉన్నారు.

మిథున్ రెడ్డిని జూలై 19న అరెస్టు చేయడం వల్ల ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది. త్వరలోనే రెండో ఛార్జిషీట్ కూడా దాఖలవ్వనుందని సమాచారం.


Digital Prime News మీకు తెలంగాణ, తెలుగు సినిమా, రాజకీయాలు, యువత అంశాల్లో తాజా వార్తలు అందిస్తుంది. మరిన్ని వార్తల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి!

Visit Us: www.digitalprimenews.in

Follow Us on Social Media:
▶️ YouTube: Digital Prime News
Facebook: Digital Prime News on Facebook
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube