హైదరాబాద్‌లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి | జీహెచ్ఎంసీ, ప్రభుత్వం అప్రమత్తం

హైదరాబాద్‌లో భారీ వర్షాలు – జీహెచ్ఎంసీ, ప్రభుత్వం అప్రమత్తం.

Homeతెలంగాణ

హైదరాబాద్‌లో భారీ వర్షాలు – జీహెచ్ఎంసీ, ప్రభుత్వం అప్రమత్తం.

హైదరాబాద్‌లో భారీ వర్షాలు – జీహెచ్ఎంసీ, ప్రభుత్వం అప్రమత్తం హైదరాబాద్, జూలై 20 (డిజిటల్ ప్రైమ్ న్యూస్): తెలంగాణలో వర్షాల బీభత్సం కొనసాగుతోంది. ముఖ్యం

తిరుమల రీల్స్ వివాదం.. గీతూ రాయల్ ఎమోషనల్ వీడియో వైరల్
ఏపీలో కొత్తగా ఆ రెండు ఎయిర్‌పోర్టులు ఫిక్స్.. కేంద్రం కీలక ప్రకటన, ఆ జిల్లాల దశ తిరిగినట్లే.
చేవెళ్ల బస్సు ప్రమాదం: తాండూరు మూడు అక్కాచెల్లెళ్లు మృతి.

హైదరాబాద్‌లో భారీ వర్షాలు – జీహెచ్ఎంసీ, ప్రభుత్వం అప్రమత్తం

హైదరాబాద్, జూలై 20 (డిజిటల్ ప్రైమ్ న్యూస్): తెలంగాణలో వర్షాల బీభత్సం కొనసాగుతోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరాన్ని వరుసగా నాలుగో రోజు వర్షాలు ముంచెత్తుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా రహదారులు జలమయమవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోతున్నాయి.

అంబర్‌పేట్, తార్నాక, ఉప్పల్, హబ్సిగూడ, మలక్‌పేట, చాదర్‌ఘాట్, సైదాబాద్, సంతోష్‌నగర్, హిమాయత్‌నగర్, నల్లకుంట, బషీర్‌బాగ్ వంటి ప్రాంతాల్లో వర్షం భారీగా కురుస్తోంది.

వాతావరణ శాఖ హెచ్చరికలు

బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో జూలై 24న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షపాతం తీవ్రంగా ఉండనుందని పేర్కొంది.

తెలంగాణలో 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని సూచించారు.

ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అప్రమత్తం

శనివారం హైదరాబాద్‌లో కురిసిన వర్షాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ సూచించింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులకు సీఎం సూచనలు ఇచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిస్థితిని దగ్గరుండి పరిశీలిస్తున్నారు. వర్షాల పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.

GHMC చర్యలు

జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్, హైడ్రా కమిషనర్, పోలీస్ కమిషనర్, వాటర్ వర్క్స్ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. వర్షపు నీరు నిలిచేలా కాకుండా డ్రైనేజీ వ్యవస్థను క్లీన్ చేయడం, వరద నీటి పారుదల చర్యలు తీసుకుంటున్నట్లు అధికారుల వర్గాలు తెలిపాయి.


Digital Prime News మీకు తెలంగాణ, తెలుగు సినిమా, రాజకీయాలు, యువత అంశాల్లో తాజా వార్తలు అందిస్తుంది. మరిన్ని వార్తల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి!

Visit Us: www.digitalprimenews.in

Follow Us on Social Media:
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News on Facebook
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube