ఢిల్లీ బ్లాస్ట్: ఎర్రకోట వద్ద 3 గంటల వెయిటింగ్.. సూసైడ్ బాంబర్ గుర్తింపు.

ఢిల్లీ బ్లాస్ట్: ఎర్రకోట వద్ద 3 గంటల వెయిటింగ్.. సూసైడ్ బాంబర్ గుర్తింపు.

Homeజాతీయంఅంతర్జాతీయం

ఢిల్లీ బ్లాస్ట్: ఎర్రకోట వద్ద 3 గంటల వెయిటింగ్.. సూసైడ్ బాంబర్ గుర్తింపు.

Delhi Blast: ఎర్రకోట దగ్గర పార్కింగ్‌లో 3 గంటలు వెయిటింగ్.. ఆ సూసైడ్ బాంబర్ ఇతనే... దేశ రాజధాని ఢిల్లీని మళ్లీ ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేసిన ఘటన ఇ

చేవెళ్ల బస్సు ప్రమాదం: తాండూరు మూడు అక్కాచెల్లెళ్లు మృతి.
సౌదీ బస్సు ప్రమాదంలో 45 హైదరాబాదీలు మృతి – విషాదం
ప్రధాని మోదీ ఎర్రకోట పేలుడు బాధితులకు పరామర్శ.

Delhi Blast: ఎర్రకోట దగ్గర పార్కింగ్‌లో 3 గంటలు వెయిటింగ్.. ఆ సూసైడ్ బాంబర్ ఇతనే…

దేశ రాజధాని ఢిల్లీని మళ్లీ ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేసిన ఘటన ఇది. ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో జరిగిన భారీ పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 9 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని LNJP ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సోమవారం సాయంత్రం 6:52 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది. క్షణాల్లోనే అగ్నిజ్వాలలు చెలరేగి, దాదాపు 10 వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రాథమిక దర్యాప్తులో అమోనియం నైట్రేట్‌ పేలుడు పదార్థంగా ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కారు యజమాని అరెస్ట్ – పుల్వామా కనెక్షన్

పేలుడు జరిగిన కారు హర్యానాలో రిజిస్టర్ అయింది. కారు చివరి యజమాని పుల్వామా వాసి తారిక్‌ అని గుర్తించారు. పోలీసులు ఇప్పటికే అతడిని అదుపులోకి తీసుకున్నారు. NSG కమాండోలు, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నాయి.

3 గంటల పాటు పార్కింగ్‌లో కారు – సూసైడ్ బాంబర్ వీడియో

CCTV ఫుటేజీ ప్రకారం, HR26 CE 7674 నంబర్ ఉన్న వైట్ హ్యుందాయ్ i20 కారు మధ్యాహ్నం 3:19 గంటలకు పార్కింగ్‌లోకి వచ్చి, సాయంత్రం 6:30 వరకు నిలిపి ఉంచారు.
ఆ సమయంలో కారు డ్రైవర్ నీలం, నలుపు రంగు టీ-షర్ట్ ధరించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతను మొత్తం సమయం కారు లోపలే ఉన్నాడని సీసీటీవీ వీడియోలు వెల్లడిస్తున్నాయి.

ఆత్మాహుతి బాంబర్ అనుమానం – వైద్యుడు ఉమర్ మొహమ్మద్‌పై దృష్టి

ఈ కారు యజమాని డాక్టర్ ఉమర్ మొహమ్మద్ అని, అతడే ఆత్మాహుతి బాంబర్ అయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఫరీదాబాద్‌లో 2,900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న రోజు జరిగిన ఈ బ్లాస్ట్‌ నేపథ్యంలో, ఈ రెండింటికీ లింక్ ఉన్నట్లు విచారణలో బయటపడుతోంది.

దేశవ్యాప్తంగా హై అలర్ట్

పేలుడు నేపథ్యంలో ఢిల్లీతో పాటు ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, జైపూర్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ పోలీసులు ఈ ఘటనపై UAPA సెక్షన్లు ప్రయోగించి ఉగ్రవాద దాడిగా దర్యాప్తు ప్రారంభించారు.

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime News‌తో కలసి ఉండండి!

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube