సెల్ఫీ నెపంతో భర్తను నదిలో తోసేసిన భార్య: కర్ణాటకలో కలకలం కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సెల్ఫీ దిగుదామని నమ్మించి ఓ భార్య త
సెల్ఫీ నెపంతో భర్తను నదిలో తోసేసిన భార్య: కర్ణాటకలో కలకలం
కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సెల్ఫీ దిగుదామని నమ్మించి ఓ భార్య తన భర్తను బ్రిడ్జి పైనుంచి నదిలో తోసేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో బాధితుడు ప్రాణాలతో బయటపడటంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే… సెల్ఫీ దిగుదామని భర్తను బ్రిడ్జిపైకి తీసుకెళ్లిన భార్య, బైక్ ఆపగానే ఒక్కసారిగా అతడిని నదిలోకి తోసేసింది. అతను గట్టిగా అరవడం వలన సమీపంలో ఉన్న స్థానికులు స్పందించి తాడుతో సహాయం చేసి అతన్ని బయటకు తీసారు. బాధితుడు తెలిపిన ప్రకారం, ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని, భార్య కావాలనే తనను చంపేందుకు ప్రయత్నించిందని చెప్పాడు.
భార్య మాత్రం ఇది ఆకస్మిక ప్రమాదంగా చెబుతోంది. సెల్ఫీ తీసుకుంటుండగా భర్త నదిలో పడిపోయాడని చెప్పినప్పటికీ, భర్త వాదన విన్న స్థానికులు షాక్‌కు గురయ్యారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో వివాహేతర సంబంధం కోణాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా ఘటనలు పెరిగిపోతుండటం గమనార్హం.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter, Instagram & YouTube .

COMMENTS