ఫ్యానిజం ఫలితం – యువతకు హెచ్చరిక…. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

ఫ్యానిజం ఫలితం – యువతకు హెచ్చరిక….

Homeజాతీయం

ఫ్యానిజం ఫలితం – యువతకు హెచ్చరిక….

బెంగళూరు ఘటన – విజయం వెనుక విషాదం! రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఎట్టకేలకు 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఐపీఎల్ కప్‌ను గెలుచుకుంది. ఈ విజయం దేశవ్యా

బీహార్‌లో యంగ్ రాకెట్‌కు దుమ్ము రైడ్!
IPL: నల్ల బ్యాండ్లు ధరించనున్న ప్లేయర్లు….
ఐపీఎల్‌ ఫైనల్‌: బెంగళూరు vs పంజాబ్‌ పోరు…..

బెంగళూరు ఘటన – విజయం వెనుక విషాదం!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఎట్టకేలకు 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఐపీఎల్ కప్‌ను గెలుచుకుంది. ఈ విజయం దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల మనసులను ఉప్పొంగిపోయేలా చేసింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీపై ఉన్న అభిమానం, అతని విజయాల కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూసిన అభిమానుల ఆశలు తీరాయి. అయితే ఈ ఆనందాన్ని వెంటాడిన విషాదం దేశాన్ని కుదిపేసింది.
బెంగళూరులో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ముగ్గురు లక్షల మంది ఒక్కసారిగా స్టేడియంకు పోటెత్తారు. ఈ భారీ జనసందోహం కారణంగా తీవ్ర తొక్కిసలాట జరిగింది. పదకొండు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఎందుకంటే.. ఒక టీమ్ గెలిచింది. అభిమానం చూపించాలన్న ఉత్సాహం.. అది భద్రతా ప్రమాణాలను మరిచేలా చేసింది. ఇదే ఫ్యానిజం. ఇదే బానిసత్వం.
ఫ్యానిజం – జీవితాన్ని నాశనం చేస్తుంది.
ఒక ఆటను ప్రేమించొచ్చు. ఒక ఆటగాడిని అభిమానించొచ్చు. కానీ దానికో హద్దుండాలి. ప్రపంచంలో అత్యుత్తమ క్రికెట్ జట్లు అయిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, అమెరికాలలోనూ ఆటగాళ్లకు ఫాలోయింగ్ ఉంది. కానీ అక్కడ అభిమానులు తమ జీవితాలను ప్రమాదంలోకి నెట్టుకుంటూ సెలబ్రిటీ కోసం ప్రాణాలు విడిచే పరిస్థితులు లేవు. వారు ఆటను ఎంజాయ్ చేస్తారు. సెలబ్రిటీలు తమ ప్రొఫెషనల్ పనిలో నిమగ్నమవుతారు. కానీ మనదేశంలో మాత్రం అభిమానం అంధత్వంగా మారిపోతోంది. యువత తమ జీవితాలను మరచిపోయి సెలబ్రిటీ క్షణాలను వెంబడిస్తున్నారు.
మీ జీవితంలో మీరే హీరో!
ఎవరైనా సినీ నటుడు విజయవంతమవుతాడు, క్రికెటర్ అయినా రాజకీయ నాయకుడైనా – వారు వారి లక్ష్యాల కోసం శ్రమిస్తున్నారు. కానీ వారిని చూస్తూ, వారి విజయాలకు హర్షధ్వానాలు చేస్తూ, ర్యాలీల్లో పాల్గొంటూ, సోషల్ మీడియాలో పోస్ట్‌లతో సమయం వృధా చేస్తూ మీరు మీ లక్ష్యాల నుంచి దూరమవుతున్నారు. అసలు మీ స్వంత కలల గురించి మీరు ఆలోచిస్తున్నారా?
బెంగళూరు ఘటన – శోకసంద్రం.
ఈ ఐపీఎల్ విజయోత్సవాల్లో మరణించిన పదకొండు మంది కుటుంబాలకు నష్టం భర్తీ అవుతుందా? కోట్ల రూపాయలు సంపాదించిన ఆటగాళ్ల మధ్య, సామాన్య అభిమానులు ప్రాణాలు పోగొట్టుకోవడం ఎంత దారుణం? ఎవరో గెలిచారు.. కానీ చనిపోయింది సామాన్య జనమే. గాయపడిన వారు ఇంక జీవితం గడపలేని స్థితికి చేరుకున్నారు.
జీవితాన్ని ప్రభావితం చేసే అభిమానం కాదు, స్ఫూర్తి కావాలి.
ఒక విజయవంతమైన వ్యక్తిని చూసి స్ఫూర్తి పొందాలి, కానీ అతని విజయాన్ని మీ జీవిత లక్ష్యంగా మార్చుకోకూడదు. ఓటమి లోనవ్వకుండా ఓర్పుగా ముందుకెళ్లే వాళ్లను ఆదర్శంగా చూడాలి. జీవితంలో అభిమానం కన్నా అత్యవసరమైనది – ఆత్మగౌరవం, లక్ష్యం, ప్రయోజనాన్ని తెలుసుకునే బుద్ధి.
మీరు ఎందులో తక్కువ?
మీరు కూడా కృషి చేస్తే మీరు కోరుకున్న రంగంలో ఎదగవచ్చు. వాళ్లకు జిందాబాద్‌లు కొడితే మీరు సాధించేదేమీ ఉండదు. జాగ్రత్తలు పాటించకుండా ర్యాలీల్లో పాల్గొనడం కాదు – నిజంగా దేశానికి అవసరమైనది.. బుద్ధిమంతులైన యువత.

Arukaleoverseas consultancy – instagram post

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube