AP Assembly, Council Monsoon Session Ends Today: Key Issues on Agenda

ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలకు నేటితో ముగింపు.. చర్చించే అంశాలివే!

Homeఆంధ్రప్రదేశ్

ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలకు నేటితో ముగింపు.. చర్చించే అంశాలివే!

ఏపీ అసెంబ్లీ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు బిల్లులు, కీలక అంశాలపై చర్చలు, ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌

ఏపీ మండలిలో వైసీపీ ఆందోళన.. పోడియం వద్ద బల్లలు చరుస్తూ నిరసన, సభ వాయిదా
ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలు.. పలువురికి కొత్త పోస్టింగులు
జగన్ పీఏ ఖాతాలో కోట్లపై పట్టాభి ప్రశ్నలు

ఏపీ అసెంబ్లీ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు బిల్లులు, కీలక అంశాలపై చర్చలు, ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు ఉభయ సభల్లో పలు కీలక అంశాలపై చర్చలు, బిల్లుల ఆమోదం, నివేదికల సమర్పణ జరగనున్నాయి. జల కాలుష్య నివారణ, నియంత్రణ సవరణ చట్టం-2024కు సంబంధించిన తీర్మానంతో పాటు పంచాయతీరాజ్‌ చట్ట సవరణ, ఒప్పంద ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ సవరణ బిల్లులు సభ ముందుకు రానున్నాయి.

ఉభయ సభల్లో జల కాలుష్య నివారణ, నియంత్రణ సవరణ చట్టం-2024ను ఆమోదించాలని కోరుతూ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లును డిప్యూటీ సీఎం ప్రవేశపెట్టనుండగా, ఒప్పంద ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ సవరణ బిల్లును మంత్రి పయ్యావుల కేశవ్‌ సభ ముందుకు తీసుకురానున్నారు.

ఇదే సమయంలో వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కమిటీ నివేదికను ఉభయ సభల్లో ఎమ్మెల్యేలు గొండు శంకరరావు, వేగేశన నరేంద్రవర్మ రాజు ప్రవేశపెట్టనున్నారు. ‘సూపర్‌ సిక్స్‌’తో పాటు ప్రజా సంక్షేమంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదం పొందిన కొన్ని బిల్లులకు శాసనమండలి నేడు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

అసెంబ్లీలో కీలక ప్రశ్నలు

శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో వైద్య సేవల నిలుపుదల, గ్రామ పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం, నిరుద్యోగ భృతి, తిరుపతి గ్రామీణ మండలంలో గృహ నిర్మాణాల క్రమబద్ధీకరణ, భీమవరంలోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయ సముదాయం వంటి అంశాలు చర్చకు రానున్నాయి.

అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్‌ పథకాల కింద నిధుల మంజూరు, తీరప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక పార్కులు, ఎరువుల కోసం యాప్‌లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణంపైనా సభ్యులు ప్రశ్నలు సంధించనున్నారు. సంబంధిత మంత్రులు ఆయా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు.

మండలిలోనూ పలు అంశాలపై ప్రశ్నలు

శాసనమండలిలో పీఎం విద్యాలక్ష్మి పథకం, గోదావరి పుష్కరాలకు నిధులు, కాపు కార్పొరేషన్‌కు నిధులు, విద్యా హక్కు చట్టం, మహిళలకు ఆర్థిక సహాయం వంటి అంశాలపై ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి.

రాయలసీమ ఎత్తిపోతల పథకం, కస్టడీ మరణాలు, నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి, 1/70 చట్టానికి సవరణ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు తదితర అంశాలపై కూడా సభ్యులు ప్రశ్నలు అడగనున్నారు.

మాజీ సభ్యులకు సంతాపం

ఇటీవల మృతిచెందిన మాజీ శాసనసభ్యులు నాదెండ్ల భాస్కరరావు, ముద్రగడ పద్మనాభం, టి. చిన్నరాజన్‌, హనుమంతరాయ చౌదరి, ఆర్‌ఎస్‌డీపీ అప్పలనరసింహరాజు, సుక్క పగడాలమ్మ, గాదె వెంకటరెడ్డి, జీఎస్‌ రావులకు శాసనసభ సంతాపం తెలపనుంది.

మొత్తంగా వర్షాకాల సమావేశాల చివరి రోజు బిల్లుల ఆమోదంతో పాటు ప్రజా సంక్షేమం, వ్యవసాయం, ఆరోగ్యం, ఉపాధి, నీటి ప్రాజెక్టులు, గిరిజన సంక్షేమం వంటి పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీశైలానికి మళ్లీ వరద.. 30,512 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

సనత్‌నగర్ TIMSపై క్లారిటీ.. సాధారణ రోగులకు NIMS తరహా ఛార్జీలు!

కేబీఆర్ పార్కు చుట్టూ వన్‌వే.. మారిన TSRTC బస్సు రూట్లు ఇవే!

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: https://www.instagram.com/digitalprimenewss/

 

 

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube