భారత్-పాక్ సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తతలు: పాక్ కాల్పులకు భారత్ దీటుగా బదులు భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దులో, ముఖ్యంగా నియంత్రణ రేఖ (L
భారత్-పాక్ సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తతలు: పాక్ కాల్పులకు భారత్ దీటుగా బదులు
భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దులో, ముఖ్యంగా నియంత్రణ రేఖ (LoC) వెంబడి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ సైన్యం గత 12 రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది.
LOC ప్రాంతాల్లోని భారత సైనిక పోస్టులే లక్ష్యంగా పాకిస్తాన్ బలగాలు నిరంతరంగా కాల్పులు జరుపుతున్నాయి. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, మెంధార్, నౌషేరా, సుందర్‌బాని, అఖ్నూర్ వంటి పలు సెక్టార్లలో ఈ కాల్పులు జరుగుతున్నాయి.
పాకిస్తాన్ సైన్యం జరుపుతున్న ఈ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. భారత బలగాలు కూడా ధీటుగా స్పందిస్తూ సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేశాయి. ఇరువైపులా కాల్పుల మార్పిడితో సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతం ఆందోళనకర వాతావరణం నెలకొని ఉంది.

COMMENTS