మంత్రి తుమ్మల సంచలనం: అర్హులకు మాత్రమే ఉచిత పథకాలు! - Digital Prime News - Latest Telugu News Digital Prime News

మంత్రి తుమ్మల సంచలనం: అర్హులకు మాత్రమే ఉచిత పథకాలు!

HomeతెలంగాణUncategorized

మంత్రి తుమ్మల సంచలనం: అర్హులకు మాత్రమే ఉచిత పథకాలు!

ఉచిత పథకాలు, రేషన్ కార్డులపై మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు: 'అర్హులకు మాత్రమే ఇవ్వాలి' తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత పథకాలు, రేషన్ కార్డుల పంపిణ

ఇండీ కూటమి ప్రెస్‌మీట్‌ – ప్రధానికి ఎంపీల లేఖ విడుదల…
డీకే సీఎం ప్రమాణ స్వీకారం.. బెంగళూరులో ప్రతిపక్ష శక్తుల మహాసమ్మేళనం?
కాంగ్రెస్ పాలన వైఫల్యం….

ఉచిత పథకాలు, రేషన్ కార్డులపై మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు: ‘అర్హులకు మాత్రమే ఇవ్వాలి’
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత పథకాలు, రేషన్ కార్డుల పంపిణీ విధానంపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్హులైన నిరుపేదలకే ఉచిత పథకాలు అందించాలని, ప్రస్తుతం ఉన్న విధానాలపై పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా రేషన్ బియ్యం పంపిణీని ఉద్దేశించి మాట్లాడుతూ, బియ్యాన్ని కేవలం నిరుపేదలకే ఇవ్వాలని, వాటిని తీసుకుని బయట అమ్ముకునే వారికి కాదని స్పష్టం చేశారు. గతంలో ఎన్టీ రామారావు రూ.2కే కిలో బియ్యం ఇస్తే ప్రజలు ఆయనను దేవుడు అన్నారని గుర్తు చేస్తూ, ఇప్పుడు మార్కెట్‌లో కిలో రూ.60 విలువ చేసే బియ్యాన్ని తమ ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని అన్నారు.
రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్యపై మంత్రి తుమ్మల సందేహాలు వ్యక్తం చేశారు. తెలంగాణలో సుమారు కోటి 10 లక్షల కుటుంబాలు ఉంటే, రేషన్ కార్డుల సంఖ్య ఏకంగా కోటి 25 లక్షలు దాటిందని గణాంకాలను ప్రస్తావించారు. పక్క రాష్ట్రాల వారు కూడా ఇక్కడ రేషన్ కార్డులు కలిగి ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. “రాష్ట్రంలో అందరూ పేదలే ఉన్నారా? అందరి దగ్గర తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. ప్రభుత్వంలో ఉండి ఇలాంటి విషయాలు చెప్పకూడదు కానీ…”

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube