రూ.999కే జియో 5G ఫోన్? - Digital Prime News - Latest Telugu News Digital Prime News

రూ.999కే జియో 5G ఫోన్?

Homeబిజినెస్

రూ.999కే జియో 5G ఫోన్?

రూ.999 ధరలో హై-ఎండ్ ఫీచర్లు – జియో ఫోన్ 5G రాకతో మార్కెట్లో కలకలం! న్యూఢిల్లీ: భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను పూర్తిగా మార్చేలా జియో ఫోన్ 5G సిద్ధ

స్టాక్ మార్కెట్ లాభాల్లో.
వారం రోజుల్లో 29% పెరిగిన రూ.10 లోపల స్టాక్స్!
యూట్యూబ్తో పాటు బిజినెస్ కూడా ….

రూ.999 ధరలో హై-ఎండ్ ఫీచర్లు – జియో ఫోన్ 5G రాకతో మార్కెట్లో కలకలం!
న్యూఢిల్లీ: భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను పూర్తిగా మార్చేలా జియో ఫోన్ 5G సిద్ధమవుతోంది. మార్కెట్లో ఇప్పటికే అనేక ఫోన్‌లు విడుదలవుతున్నా, రాబోతున్న ఈ జియో ఫోన్ మార్కెట్‌ను షేక్ చేసే అవకాశముంది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇప్పుడు ఫోన్ తయారీ రంగంలో మరో విప్లవానికి సిద్ధమవుతోందని లీకుల ద్వారా తెలుస్తోంది.
ధరలో విప్లవం – ₹999 నుంచే ప్రారంభమవుతుందా?
వినియోగదారులు ఆశ్చర్యపోయేలా, ఈ స్మార్ట్‌ఫోన్ ధర ₹4,999–₹5,999 మధ్య ఉండవచ్చని అంచనాలు. కానీ జియో ఇచ్చే డేటా బండిల్, ఎక్స్చేంజ్ ఆఫర్లు, సబ్‌సిడీలు వంటివి కలిపితే ఈ ఫోన్‌ ధర ₹999 లేదా ₹1,199కు పడిపోయే అవకాశముందని తెలుస్తోంది.
వైవిధ్యమైన ఫీచర్లు – హై-ఎండ్ ఫోన్లకు పోటీ:
200MP కెమెరా:
లీకైన సమాచారం ప్రకారం, జియో ఫోన్ 5Gలో 200 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఇవి సామాన్యంగా రూ.30,000కిపైగా ధర ఉన్న ఫోన్లలో మాత్రమే లభించే ఫీచర్లు.
7200mAh భారీ బ్యాటరీ:
ఈ ఫోన్‌ 7200mAh బ్యాటరీతో వస్తుందని చెప్పబడుతోంది. ఇది చాలామంది పవర్ యూజర్లకు అదనపు బలం. పైగా ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతిచ్చే అవకాశం ఉంది.
డిస్‌ప్లే & కనెక్టివిటీ:
5.5 అంగుళాల 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే
పూర్తి 5G సపోర్ట్:
డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, Bluetooth 5.2, రివర్స్ ఛార్జింగ్
ప్రాసెసర్, మెమరీ:
ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది. మల్టీటాస్కింగ్‌, యూట్యూబ్‌ చూడటం, లైట్ గేమింగ్‌ వంటి పనులకు ఇది సరిగ్గా సరిపోతుంది. RAM 16GB, స్టోరేజ్ 512GB వరకు ఉండవచ్చని సమాచారం.
భవిష్యత్తులో మార్కెట్‌పై ప్రభావం:
జియో ఫోన్ 5G ద్వారా రిలయన్స్, అత్యాధునిక ఫీచర్లు, తక్కువ ధర, అన్నింటిని కలిపి వినియోగదారులకు పెద్ద అవకాశం ఇవ్వనుంది. దేశంలోని బడ్జెట్ ఫోన్ మార్కెట్‌ను ఇది పూర్తిగా మార్చే అవకాశముంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారుల కోసం ఇది స్మార్ట్ డిజిటల్ పరిష్కారం అవుతుంది.
₹1,000 లోపు ధరలో 5G, 200MP కెమెరా, 7200mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉండటం నిజమైతే, జియో ఫోన్ 5G భారత టెక్ మార్కెట్‌లో సంచలనం సృష్టించనుంది. అతి త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0
Follow by Email
YouTube
YouTube