ఫామ్‌లో ఉన్నప్పటికీ సంజు శాంసన్‌కు అవకాశాలు రాకపోవడం వివాదం. గంభీర్, సెలెక్టర్ల నిర్ణయాలపై అభిమానులు ప్రశ్నలు. Sanju Samson Benched Again: భారత్–దక్ష
ఫామ్‌లో ఉన్నప్పటికీ సంజు శాంసన్‌కు అవకాశాలు రాకపోవడం వివాదం. గంభీర్, సెలెక్టర్ల నిర్ణయాలపై అభిమానులు ప్రశ్నలు.
Sanju Samson Benched Again: భారత్–దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా మంచి ఆరంభం చేసింది. కటక్‌లో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించినప్పటికీ, జట్టులో చోటు దక్కించుకోవని ఒక స్టార్ ఆటగాడు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధాన చర్చగా మారాడు. ఆ ఆటగాడు మరెవరో కాదు — కేరళ వికెట్ కీపర్–బ్యాటర్ సంజు శాంసన్. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ వరుసగా బెంచ్‌కే పరిమితం చేయడం అభిమానుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. కోచ్ గౌతమ్ గంభీర్‌కి సంజుపై ఏదైనా పాత పగ ఉందా? అనే ప్రశ్నలు పెద్దఎత్తున వస్తున్నాయి.
సంజు ప్రస్తుతం టీమిండియా స్క్వాడ్‌లో ఉన్నప్పటికీ, తుది ప్లేయింగ్ XIలో మాత్రం స్థానం సంపాదించలేకపోతున్నాడు. సంజు ఓపెనర్‌గానూ, మధ్యంతర బ్యాటర్‌గానూ రాణించగలిగే వ్యవహారంలోనూ, గంభీర్ మాత్రం ఓపెనింగ్‌లో శుభ్‌మన్ గిల్‌కు వరుస అవకాశాలు ఇస్తున్నారు. ఈ ఏడాది 13 టీ20 ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ గిల్ ఒక్క అర్ధశతకమూ చేయలేకపోయాడు. అయినప్పటికీ అతనిపై నమ్మకాన్ని కోచ్ వదలడం లేదు.
ఇక వికెట్ కీపర్‌గా ఎంపికైన జితೇಶ್ శర్మ కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాడు. జితేష్ స్థిరమైన ఫామ్‌లో లేనప్పటికీ, సంజుకు అవకాశం రాకపోవడం అభిమానులకు ఆశ్చర్యంగా ఉంది. ఇదే సమయంలో దేశవాళీ క్రికెట్‌లో సంజు అదరగొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ–2025లో 6 ఇన్నింగ్స్‌ల్లో 58.25 సగటుతో 233 పరుగులు చేశాడు. రెండు అర్ధశతకాలతో పాటు 137+ స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. అయినప్పటికీ ఈ అద్భుత ఫామ్ టీమిండియా డ్రెస్‌రూమ్‌లో అవకాశంగా మారకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తీసుకుంటున్న నిర్ణయాలు ‘పక్షపాతంగా’ ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు, పాత సంబంధాలు ఎంపికలపై ప్రభావం చూపిస్తున్నాయా? అన్న అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. గంభీర్ ఉన్నంతకాలం సంజుకు టీమిండియాలో అవకాశమే లేదని కొందరు అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అద్భుత ప్రతిభ, కట్టిపడేసే ఫామ్ ఉన్నప్పటికీ సంజు శాంసన్‌కు న్యాయం జరగడం లేదనే భావన పెరుగుతోంది. రాబోయే మ్యాచుల్లో అయినా గంభీర్ తన నిర్ణయాన్ని పునః పరిశీలించి సంజుకు అవకాశం ఇస్తారేమో చూడాలి.
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews
ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime Newsతో కలసి ఉండండి!

COMMENTS