ములుగు, జూలై 6: ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేగ కళ్యాణి గారు మార్కెట్ కమిటి చైర్మనుగా నియమితులైన సందర్భంగా మంత్రి సీతక్కను కలసి ఆశీర్వ
ములుగు, జూలై 6:
ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేగ కళ్యాణి గారు మార్కెట్ కమిటి చైర్మనుగా నియమితులైన సందర్భంగా మంత్రి సీతక్కను కలసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. పార్టీకి అంకితంగా పనిచేస్తే ఎవరికి అయినా గుర్తింపు లభిస్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి రేగ కళ్యాణి గారు ఈరోజు మంత్రి శ్రీమతి దనసరి అనసూయ సీతక్క గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీతక్క గారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా రేగ కళ్యాణి గారు మాట్లాడుతూ, “నన్ను నమ్మి ఈ పదవికి కృషి చేసిన సీతక్క గారి ఋణం తీర్చుకోలేను” అని హృదయపూర్వకంగా తెలిపారు. మంత్రి సీతక్క గారు కళ్యాణి గారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
సీతక్క గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో కష్టపడే ప్రతీ కార్యకర్తకు గుర్తింపు ఖాయం అని, కళ్యాణి గారి నియామకమే దానికి ఉదాహరణ అని చెప్పారు. ప్రజలలో చురుకుగా ఉంటూ, పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆమె సూచించారు.
Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter, Instagram & YouTube .

COMMENTS