Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. రైతన్నా నీ పంట జర పైలం! - Digital Prime News - Latest Telugu News Digital Prime News

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. రైతన్నా నీ పంట జర పైలం!

Homeజాతీయం

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. రైతన్నా నీ పంట జర పైలం!

వాతావరణ హెచ్చరిక: దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు - నాలుగు రోజులు ఎల్లో అలెర్ట్ హైదరాబాద్‌, మే 20: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్ర

తెలంగాణలో భారీ వర్షాలు – జిల్లాల్లో రికార్డు వర్షపాతం…
తమిళనాడులో వర్షం బీభత్సం – 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.
గుంటూరు జిల్లాలో భారీ వర్షం – ట్రాఫిక్‌కు అంతరాయం, చెట్లు నేలకొరుగు….

వాతావరణ హెచ్చరిక: దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు – నాలుగు రోజులు ఎల్లో అలెర్ట్
హైదరాబాద్‌, మే 20:
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ ప్రభావం మే 23 వరకు కొనసాగనుందని స్పష్టం చేసింది.
కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు కర్ణాటక తీరాన్ని తుఫాను తాకే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
ఏపీ జిల్లాల్లో హెచ్చరిక:
కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో తీవ్ర వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.
తెలంగాణలో పరిస్థితి:
హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకారం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. సోమవారం (మే 19) నాటికి వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. మంగళవారం (మే 20) నాటికి కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు తదితర జిల్లాల్లో వర్షపాతం తీవ్రంగా ఉంటుందని అంచనా.
ఎల్లో అలెర్ట్ జారీ:
బుధవారం (మే 21), గురువారం, శుక్రవారం రోజుల్లోనూ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 30–40 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని IMD హెచ్చరించింది.
రైతులకు సూచనలు:
ఈ అకాల వర్షాల దృష్ట్యా రైతులు తమ పంటలను రక్షించుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే ప్రజలు వర్షకాల ప్రమాదాలను నివారించేందుకు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేసింది.

websoft technologies- Data Science

websoft technologies- Data Science

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0
Follow by Email
YouTube
YouTube