దక్షిణ తమిళనాడులో కుండపోత వర్షాలు – 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. దక్షిణ తమిళనాడులో ముసలిమెత్తగా కురుస్తున్న వర్షాలు పరిస్థితిని తీవ్రంగా ప్రభావితం చేశ
దక్షిణ తమిళనాడులో కుండపోత వర్షాలు – 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.
దక్షిణ తమిళనాడులో ముసలిమెత్తగా కురుస్తున్న వర్షాలు పరిస్థితిని తీవ్రంగా ప్రభావితం చేశాయి. కోయంబత్తూర్, నీలగిరి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో 11 జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. ముఖ్యంగా నీలగిరి జిల్లాలో వర్షపాతం అధికంగా ఉండటంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
పర్యాటక ప్రాంతాల్లోని రహదారులపై వర్షపు నీరు చేరడంతో పర్యాటకుల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వర్షాల కారణంగా ప్రయాణాలు నిలిచిపోయి పర్యాటకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

COMMENTS