పాక్ ఉద్రిక్తతలు: దేశ రక్షణ దళాలకు రోహిత్ శర్మ మద్దతు - నకిలీ వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి పాకిస్తాన్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత
పాక్ ఉద్రిక్తతలు: దేశ రక్షణ దళాలకు రోహిత్ శర్మ మద్దతు – నకిలీ వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి
పాకిస్తాన్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ దేశ రక్షణ దళాలకు తన మద్దతును ప్రకటించారు. దేశ రక్షణ కోసం త్రివిధ దళాలు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల తాను గర్వంగా ఉన్నానని, మన సైనికులు దేశ గౌరవాన్ని నిలబెడుతున్నారని ఆయన కొనియాడారు.
ఈ సమయంలో ప్రతి భారతీయుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రోహిత్ శర్మ కోరారు. ముఖ్యంగా, నకిలీ వార్తలను వ్యాప్తి చేయవద్దని, అలాగే వాటిని నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని రోహిత్ ఆకాంక్షించారు.
COMMENTS