పాశమైలారం ఫ్యాక్టరీ పేలుడు: 36 మంది మృతి - మంత్రి వివేక్

పాశమైలారం ఫ్యాక్టరీ పేలుడు: 36 మంది మృతి – మంత్రి వివేక్

HomeతెలంగాణUncategorized

పాశమైలారం ఫ్యాక్టరీ పేలుడు: 36 మంది మృతి – మంత్రి వివేక్

Digital Prime News - 01 జూలై 2025. పేలింది రియాక్టర్ కాదు.. ఎయిర్ డ్రయర్ ప్రెజర్ వల్లే యాక్సిడెంట్ : కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సంగారెడ్డి

నేడు ఎంపీహెచ్ ఫలితాలు విడుదల….
ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతి వివరాలు
ఆడుకుంటూ రూ.10 కాయిన్ మింగిన బాలిక మృతి: యాదాద్రి విషాదం

Digital Prime News – 01 జూలై 2025.

పేలింది రియాక్టర్ కాదు.. ఎయిర్ డ్రయర్ ప్రెజర్ వల్లే యాక్సిడెంట్ : కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి

సంగారెడ్డి జిల్లా పాశమైలారం ప్రాంతంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 12కు పెరిగింది. మరో 26 మంది గాయపడగా, వారిలో 12 మందిని తీవ్రంగా గాయాల పాలయ్యారని సమాచారం. ఈ దుర్ఘటన స్థానాన్ని పరిశీలించిన కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఘటనపై స్పందిస్తూ ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు.

రియాక్టర్ పేలుడు కారణంగా ఈ ప్రమాదం జరగలేదని స్పష్టం చేసిన మంత్రి వివేక్, ఎయిర్ డ్రయర్ లో ఏర్పడిన అధిక ప్రెజర్ వల్లే ఈ విషాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై రాజకీయం చేయకుండా బాధితులకు తోడుగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఘటన జరిగిన 15 నిమిషాల లోపలే కలెక్టర్, ఎస్పీలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారని తెలిపారు.

గాయపడిన వారిని తక్షణమే ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించామని, ప్రస్తుతం 12 మందికి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మిగతా 22 మందికి స్వల్ప గాయాలేనని, వారు త్వరలో కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 36 మంది మృతి చెందినట్లు అధికారికంగా ధృవీకరించబడిందని, అయితే వ్యర్థాలను పూర్తిగా తొలిగించిన తరువాతే ఖచ్చితమైన సమాచారం బయటపడుతుందని పేర్కొన్నారు.

ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతుందనీ, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి బాధిత కార్మికులకు ఎక్స్ గ్రేషియా అందిస్తామని, ప్రభుత్వం తరపున కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఇక ఈ ప్రమాద స్థలాన్ని మరోసారి పరిశీలించిన మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, రెస్క్యూ పనులు మూడు గంటలుగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 90 మంది పనిచేస్తున్నారని, భవనం శిధిలాల కింద మరికొందరు ఉండే అవకాశముందని చెప్పారు. మృతుల వివరాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter, Instagram & YouTube Channel.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube