తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలను జూలై నెలలో నిర్వహించేందుకు యోచిస్తు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలను జూలై నెలలో నిర్వహించేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంత్రులతో సమావేశంలో అధికారులకు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.
బీసీలకు 42% రిజర్వేషన్‌పై ఇంకా క్లారిటీ రాకపోవడంతో పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్రంలోని చాలా గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు ఏడాది క్రితమే ముగిసింది. దీంతో గ్రామీణ పరిపాలన తిరిగి పునరుద్ధరించేందుకు ప్రభుత్వం త్వరితగతిన ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఉంది.
ప్రధాన అంశాలు:
ఎన్నికలు జరగనున్న గ్రామ పంచాయతీలు: 12,777 (మొత్తం 12,848లో 71 గ్రామాలు విలీనమైనవి)
మహిళలకు రిజర్వేషన్: 50%
గ్రామీణ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు: బీసీలకు 20–22%, ఎస్సీలకు 18–20%, ఎస్టీలకు 8–10%
రొటేషన్ అమలు: గతంలో ఉన్న రిజర్వ్డ్ సీట్లు ఈసారి మారుతాయి
ఇతర వివరాలు:
12,769 గ్రామ పంచాయతీలు, 539 మండల ప్రజా పరిషత్‌ల గడువు 2023 ఫిబ్రవరిలో ముగిసింది.
28 జిల్లా పరిషత్‌ల గడువు 2024 జూలై 5తో ముగియనుంది.
ఎన్నికలు ఆలస్యం కావడంతో గ్రామీణ పరిపాలన, ప్రజారోగ్యం, తాగునీటి వంటి సేవలపై తీవ్ర ప్రభావం పడింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలో ఎన్నికల షెడ్యూల్, ఓటరు జాబితా, నామినేషన్ ప్రక్రియలపై స్పష్టమైన ప్రకటన చేయనుంది.

COMMENTS