Nobel Peace Prize 2025: నేటి నోబెల్ శాంతి బహుమతి ఎవరికి? కోటి కళ్లతో ఎదురుచూస్తున్న ట్రంప్ నార్వేలోని నోర్వేజియన్ నోబెల్ కమిటీ ప్రతి సంవత్సరం ప్రదానం
Nobel Peace Prize 2025: నేటి నోబెల్ శాంతి బహుమతి ఎవరికి? కోటి కళ్లతో ఎదురుచూస్తున్న ట్రంప్
నార్వేలోని నోర్వేజియన్ నోబెల్ కమిటీ ప్రతి సంవత్సరం ప్రదానం చేసే నోబెల్ శాంతి బహుమతి ఈ ఏడాది ఎవరిని వరిస్తుందో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ అవార్డు గెలుచుకునే అదృష్టం ఎవరికి దక్కుతుందోనని కోట్లాది మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈసారి అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరు చర్చనీయాంశంగా మారింది.
2025 నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize 2025) ఈ రోజు, అక్టోబర్ 10న ప్రకటించనున్నారు. ఈ అవార్డుపై ట్రంప్ తీవ్ర ఆసక్తి చూపిస్తున్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలను ఆపానని, గాజా కాల్పుల విరమణకు సహకరించానని, అందుకే తాను ఈ ప్రతిష్టాత్మక బహుమతికి అర్హుడినని ట్రంప్ బహిరంగంగా వ్యాఖ్యానించారు.
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ ఏడాది నోబెల్ బహుమతిపై ప్రపంచ దృష్టి సారించింది. సోషల్ మీడియాలో కూడా ట్రంప్ పేరు ట్రెండింగ్‌లో నిలిచింది. ఆయన అనుచరులు ట్రంప్ తప్పక నోబెల్ శాంతి బహుమతిని అందుకోవాలనే ప్రచారం చేస్తున్నారు. అయితే నిపుణుల అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. గాజా కాల్పుల విరమణ ఒప్పందానికి ముందే నోబెల్ కమిటీ తన నిర్ణయాన్ని ఖరారు చేసిందని సమాచారం. ఈ నేపథ్యంలో ట్రంప్ ఆశలు గగనంలో కలిసిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ట్రంప్ నోబెల్ బహుమతిపై చూపే ఆసక్తి కొత్తది కాదు. 2020లో కూడా తాను ఈ అవార్డుకు అర్హుడినని చెప్పిన ట్రంప్, ఆ ఏడాది అవార్డు దక్కకపోవడంతో నోబెల్ కమిటీని విమర్శించారు. “ఇది మోసపూరితమైన అవార్డు” అంటూ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, ఈ ఏడాది కూడా ఆయన ఆశలు చావలేదు. ప్రపంచ శాంతికి తాను చేసిన కృషిని గుర్తించి ఈసారి కమిటీ తనను గౌరవిస్తుందన్న నమ్మకం ట్రంప్ వ్యక్తం చేస్తున్నారు.
ఏదేమైనా, నోబెల్ శాంతి బహుమతి 2025 విజేత ఎవరో కొన్ని గంటల్లోనే తేలనుంది. ట్రంప్ ఆశలు నిజమవుతాయా? లేక మరోసారి నిరాశే ఎదురవుతుందా? అన్నది ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది

COMMENTS