హిల్ట్ పాలసీ రియల్టర్లకే లాభం: కిషన్‌రెడ్డి విమర్శలు
Homeతెలంగాణజాతీయం

Kishan Reddy Slams HILT Policy as Pro-Realtor Move

హిల్ట్ పాలసీ రియల్టర్లకు, బడా వ్యాపారులకు లాభం చేస్తుందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. రైతులకు నష్టం, ట్రాఫిక్ సమస్యలు పెరుగుతాయని హెచ్చరించారు. Kishan R

భారత్ లో కరోనా విజృంభణ: నాలుగు వేలు దాటిన యాక్టివ్ కేసులు!
“భారత్-నేపాల్ సరిహద్దులో డ్రోన్ల కలకలం”…
రాహుల్ గాంధీకి మూడో వరుస సీటు.. రిపబ్లిక్ డే వివాదం

హిల్ట్ పాలసీ రియల్టర్లకు, బడా వ్యాపారులకు లాభం చేస్తుందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. రైతులకు నష్టం, ట్రాఫిక్ సమస్యలు పెరుగుతాయని హెచ్చరించారు.

Kishan Reddy – HILT Policy: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హిల్ట్‌ (Hyderabad Industrial Land Transformation – HILT) పాలసీ పూర్తిగా రియల్టర్లకు, బడా వ్యాపారులకు లాభం చేకూర్చేందుకే రూపొందించబడిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ పాలసీని సీఎం రేవంత్ రెడ్డి భారీ భూదందాకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. పరిశ్రమలకు కేటాయించిన భూములను ఎలాంటి సంప్రదింపులు, ప్రజాభిప్రాయాలు లేకుండా రియల్ ఎస్టేట్ కమర్షియల్ జోన్లుగా మార్చడం రాష్ట్ర భవిష్యత్తుకు హానికరమని పేర్కొన్నారు.

ఏళ్ల తరబడి రైతులు జోన్లు మార్చాలని కోరినా పట్టించుకోని ప్రభుత్వం, పెద్ద పారిశ్రామిక వేత్తలకు మాత్రం అడగకుండానే భూముల కన్వర్షన్ అనుమతులు ఇవ్వడం పూర్తిగా రైతు ద్రోహమని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. పరిశ్రమలకు కేటాయించిన భూములను తొలగించడం వల్ల వేలాది కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడుతుందని, దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

హిల్ట్ పాలసీ హైదరాబాద్ నగరానికి కొత్త భారమే అవుతుందని, రియల్ ఎస్టేట్ హడావుడి పెరిగితే ట్రాఫిక్, డ్రైనేజీ, మౌలిక వసతులపై తీవ్ర ఒత్తిడి పడుతుందని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే బెంగళూరులో ఇలాంటి సమస్యలవల్ల అనేక కంపెనీలు వెనక్కి వెళ్లాల్సి వచ్చిందని గుర్తుచేస్తూ, హైదరాబాద్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

హెచ్‌సీయూ భూముల విషయంలో సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిన తర్వాతే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ హిల్ట్ పాలసీని కొనసాగిస్తే ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధి పేరుతో భూములను రియల్ ఎస్టేట్‌కు అప్పగించడం క్షమించరాని తప్పిదమని పేర్కొంటూ, హిల్ట్ పాలసీ మరియు జీవో 27ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

పాలసీపై నిపుణులు, పరిశ్రమలు, రైతు సంఘాలు, ప్రజా ప్రతినిధులను సంప్రదించకుండా తీసుకున్న నిర్ణయం పారదర్శకత లేనిదని, ఇది భారీ రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు మార్గం సుగమం చేస్తుందని కిషన్‌రెడ్డి అన్నారు. హిల్ట్ పాలసీ రాష్ట్ర అభివృద్ధికి కాకుండా రాజకీయ, వ్యాపార ప్రయోజనాలకు కట్టుబడి ఉందని ఆయన విమర్శించారు.

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime News‌తో కలసి ఉండండి!

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube