మౌంట్ ఎవరెస్ట్‌పై మంచు తుపాను బీభత్సం.. 1000 మంది చిక్కుకుపోయిన దారుణంమౌంట్ ఎవరెస్ట్ పరిసరాల్లో మంచు తుపాన్ తీవ్ర బీభత్సం సృష్టించింది. టిబెట్ వైపు
మౌంట్ ఎవరెస్ట్‌పై మంచు తుపాను బీభత్సం.. 1000 మంది చిక్కుకుపోయిన దారుణం
మౌంట్ ఎవరెస్ట్ పరిసరాల్లో మంచు తుపాన్ తీవ్ర బీభత్సం సృష్టించింది. టిబెట్ వైపు 16 వేల అడుగుల ఎత్తులో భారీ హిమపాతం సంభవించడంతో సుమారు వెయ్యి మంది చిక్కుకుపోయారు. శుక్రవారం సాయంత్రం మొదలైన ఈ మంచు తుపాన్ శనివారం నాటికి మరింత భీకరరూపం దాల్చింది. ప్రస్తుతం సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. రహదారులు మంచుతో పూర్తిగా కప్పబడి, క్యాంప్‌ల దారి మూసుకుపోయింది. స్థానిక రెస్క్యూ బృందాలు మరియు ప్రజలు క్షేత్రస్థాయిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు.
ఇకపోతే, నేపాల్‌లో వరుస వర్షాలు కూడా బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండచరియలు, వరదలు ఇళ్లు, రహదారులను ముంచెత్తాయి. ఈ విపత్తుల్లో ఇప్పటివరకు 51 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఐలం జిల్లాలోనే 37 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది. మరిన్ని తాజా రాజకీయ విశ్లేషణలు, కామెంటరీ కోసం మా వెబ్‌సైట్ మరియు యూట్యూబ్ చానెల్‌ను ఫాలో అవ్వండి.
Visit: www.digitalprimenews.in
Follow Us on Social Media:
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News on Facebook
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

COMMENTS