మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత్ ఘన విజయం – పాకిస్తాన్‌పై 88 పరుగుల తేడాతో గెలుపుమహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. 248 పరు
మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత్ ఘన విజయం – పాకిస్తాన్‌పై 88 పరుగుల తేడాతో గెలుపు
మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలో దిగిన పాకిస్తాన్ జట్టు 43 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. దీప్తి శర్మ, క్రాంతి గౌడ్ చెరో మూడు వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ మ్యాచ్ మధ్యలో మైదానంలో కీటకాలు విరుచుకుపడటంతో ఆట కొంతసేపు నిలిచిపోయింది. ఆటగాళ్లకు ఇబ్బందులు కలగడంతో పాకిస్తాన్ జట్టు పురుగుమందులు పిచికారీ చేయడం గమనార్హం.
టాస్ నిర్ణయం కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. పాకిస్తాన్ కెప్టెన్ “టెయిల్స్” అని చెప్పినా, అధికారులు “హెడ్స్” అని ప్రకటించడంతో వివాదం రేగింది. చివరగా భారత్ 247 పరుగులకు ఆలౌట్ కాగా, పాకిస్తాన్ జట్టు పేలవంగా ఆడి 159 పరుగులకే పరిమితమైంది.
భారత జట్టు వన్డేల్లో పాకిస్తాన్‌పై ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 12 సార్లు విజయం సాధించడం విశేషం.
మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత్ మరోసారి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 88 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌట్ అయింది. రిచా ఘోష్ (35), హర్లీన్ దేవల్ (46), జెమిమా రోడ్రిగ్స్ (32) కీలక పరుగులు సాధించారు.
లక్ష్యం ఛేదనలో పాకిస్తాన్ జట్టు ఆరంభం నుంచే కష్టాల్లో పడింది. కేవలం 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. సిద్రా అమీన్ (81) పోరాడినప్పటికీ, మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించలేదు. నటాలియా పర్వేజ్ 33 పరుగులు చేసి కొంతసేపు జట్టును నిలబెట్టినా, చివరికి పాకిస్తాన్ 43 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది.
భారత్ బౌలర్లలో క్రాంతి గౌడ్ 10 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు, దీప్తి శర్మ మూడు వికెట్లు, స్నేహ్ రాణా రెండు వికెట్లు తీశారు. ఈ విజయం తర్వాత భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య వన్డేల్లో ఇప్పటివరకు జరిగిన 12 మ్యాచ్‌ల్లో 12 సార్లు భారత్ విజయం సాధించింది.
అయితే ఈ మ్యాచ్‌లో కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. మధ్యలో మైదానంలో కీటకాలు విరుచుకుపడటంతో ఆట కొంతసేపు ఆగిపోయింది. ఆటగాళ్ల కళ్లలో పడటం వల్ల ఇబ్బంది కలగడంతో పాకిస్తాన్ ఆటగాళ్లు పురుగుమందులు పిచికారీ చేయాల్సి వచ్చింది.
టాస్ విషయమై కూడా వివాదం రేగింది. పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా “టెయిల్స్” అని పిలిచినా, అధికారులు “హెడ్స్” అని ప్రకటించడంతో సోషల్ మీడియాలో చర్చ చెలరేగింది.
మ్యాచ్ తర్వాత ఇరు జట్లు ఒకరితో ఒకరు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం గమనార్హం. ఆసియా కప్‌లో మాదిరిగానే ఈ సారి కూడా భారత్-పాకిస్తాన్ ఆటగాళ్లు కరచాలనం చేయలేదు.
భారత్ గెలుపుతో ఈ ప్రపంచ కప్‌లో తమ బలాన్ని మరోసారి నిరూపించింది.

COMMENTS