లండన్, అమెరికా పర్యటనకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) లండన్, అమెర
లండన్, అమెరికా పర్యటనకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) లండన్, అమెరికా పర్యటనకు ఇవాళ బయలుదేరారు. అమెరికాలో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, అలాగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.
ఇంకా లండన్‌లో జరుగబోయే ఇండియా వీక్ 2025 కార్యక్రమంలో ప్రధాన ఉపన్యాసకుడిగా కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు అంతర్జాతీయ కంపెనీలు, మేధావులు, రాజకీయ నాయకులు, విద్యార్థులతో భేటీ అవుతారు.
కేటీఆర్ ఈ పర్యటనలో, మెక్‌లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి ప్రఖ్యాత ఆటోమోటివ్ కంపెనీలకు R&D సేవలు అందించే Pragmatic Design Solution Limited (PDSL) నాలెడ్జ్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు.
ఈ పర్యటన తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి దిశగా తోడ్పాటు అందించేలా ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
COMMENTS