ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో ఎన్కౌంటర్: రూ.20 లక్షల రివార్డు మావోయిస్టు నేత జగన్ సహా నలుగురు మృతి. అల్లూరి జిల్లా: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో భద్రతా బల
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో ఎన్కౌంటర్: రూ.20 లక్షల రివార్డు మావోయిస్టు నేత జగన్ సహా నలుగురు మృతి.
అల్లూరి జిల్లా: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అల్లూరి జిల్లాలోని వై.రామవరం, జీకేవీధి మండలాల పరిధిలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో రూ.20 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు కీలక నేత జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు గాలింపు చేపట్టగా మావోలు ఎదురుపడ్డారని, దీంతో కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. ఎన్కౌంటర్ స్థలంలో జగన్తో పాటు మరో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు గుర్తించారు. వారి నుంచి రెండు ఏకే-47 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో సరిహద్దు ప్రాంతంలో అప్రమత్తత కొనసాగుతోంది.

COMMENTS