Owaisi College Row: High Court Questions Telangana Govt

ఒవైసీ విద్యాసంస్థపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి కఠిన ప్రశ్నలు

Homeతెలంగాణ

ఒవైసీ విద్యాసంస్థపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి కఠిన ప్రశ్నలు

ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ ఎఫ్‌టీఎల్‌లో లేదన్న ప్రభుత్వ నివేదికపై హైకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. చెరువు ఆక్రమణలపై హైడ్రా పాత్రను కూడా ప్రశ్నించింది.

హైదరాబాద్‌లో జయలలిత భవనం సీజ్.. GHMC చర్యలు
క్యూర్-2026తో భారీ షాక్.. హైదరాబాద్‌లో ఆస్తిపన్ను 4 రెట్లు పెరుగుతుందా?
హనుమాన్ శోభాయాత్రకు 3వేల పోలీసుల భద్రత

ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ ఎఫ్‌టీఎల్‌లో లేదన్న ప్రభుత్వ నివేదికపై హైకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. చెరువు ఆక్రమణలపై హైడ్రా పాత్రను కూడా ప్రశ్నించింది.

ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ భవనం సల్కం చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ (FTL) పరిధిలో లేదని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన నివేదికపై న్యాయస్థానం కీలక ప్రశ్నలు సంధించింది. రెవెన్యూ, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా నిర్వహించిన సర్వే నివేదికను అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు సమర్పించారు. గత ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయ కింద చెరువు కట్ట అభివృద్ధి చేశారని, ప్రస్తుతం ఎఫ్‌టీఎల్‌లో ఎలాంటి నిర్మాణాలు లేవని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ వివరణపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

నివేదికకు జత చేసిన మ్యాపులను పరిశీలించిన ధర్మాసనం పలు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. చెరువు పరిధిలో అక్రమ నిర్మాణాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ వాటిని ఎఫ్‌టీఎల్ ఆక్రమణగా ఎందుకు పరిగణించడం లేదని ప్రశ్నించింది. గత రికార్డుల్లో సల్కం చెరువు విస్తీర్ణం 39 ఎకరాలుగా నమోదు కాగా, ప్రస్తుతం ఎఫ్‌టీఎల్ ఎలా తగ్గిందని నిలదీసింది. 2016లో జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ అనంతరం ఇప్పటి వరకు తుది నోటిఫికేషన్ ఎందుకు విడుదల కాలేదని కూడా వివరణ కోరింది. హైడ్రా ఇతర ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపుపై చర్యలు తీసుకుంటూ, ఈ చెరువు విషయంలో ఏం చేసిందని ప్రశ్నించింది.

పిటిషన్‌కు వ్యతిరేకంగా ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ, సలార్-ఏ-మిల్లత్ ట్రస్టు తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, నిర్మాణాలు పూర్తయిన ఎన్నో సంవత్సరాల తర్వాత పిటిషన్ దాఖలు చేయడంలో ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, టీఎస్-బీపాస్ చట్టం ప్రకారం అక్రమ నిర్మాణాలపై ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేసింది. చెరువులు, జలవనరులు ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలని, భవిష్యత్ తరాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి విషయాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అక్రమ నిర్మాణాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు అమలు చేసిందో వివరాలు సమర్పించాలని ఆదేశించింది.

ఇదిలా ఉండగా, ఈ కేసు పిటిషనర్ న్యాయవాది విజయ్ గోపాల్ తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన హైకోర్టు, ఆయన భద్రతను ప్రభుత్వం నిర్ధారించాలని ఆదేశించింది. మరోవైపు ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ భవనంపై జీహెచ్‌ఎంసీ చర్యలకు సంబంధించి గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను మరో ధర్మాసనం వెనక్కి తీసుకోవడం కూడా ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామంగా మారింది.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రశ్న రావణ్‌కు మరో షాక్.. బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్‌కు పోలీసుల చర్యలు

H-1B వీసాపై ట్రంప్ షాక్.. ఆగస్టు నుంచి కఠిన నిబంధనలు

శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి కన్నుమూత.. అభిమానుల్లో విషాదం

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

 

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube