తెలంగాణలో రాజకీయంగా కీలకమైన అంశంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ రోజు (జూన్ 7) మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును కాళేశ్
తెలంగాణలో రాజకీయంగా కీలకమైన అంశంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ రోజు (జూన్ 7) మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు అయ్యారు. దాదాపు గంటకు పైగా సాగిన విచారణలో కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ అడిగిన ప్రతీ ప్రశ్నకు హరీష్ రావు సమగ్రంగా, ఆధారాలతో సహా సమాధానం ఇచ్చినట్టు సమాచారం.
హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో ఏర్పాటు చేసిన కమిషన్ విచారణలో హరీష్ రావు స్పష్టతతో మాట్లాడుతూ — తన మంత్రిత్వ కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా పురోగమించిందో, ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాల వెనుక ఉన్న పరిపాలనా తర్కం ఏంటో కమిషన్‌కు వివరించినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు పనుల పునర్నిర్మాణం, నాణ్యతపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి స్పష్టతనిస్తూ, సంబంధిత ఫైళ్లను, నివేదికలను, పత్రాలను కూడా సమర్పించినట్టు కమిషన్ వర్గాలు వెల్లడించాయి.
విచారణ అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఆయన ప్రసంగం ద్వారా తన వైఖరిని వివరించే అవకాశముందని తెలుస్తోంది. దీనికి తోడు, బీఆర్‌కే భవన్ వద్ద మీడియా ప్రతినిధులు భారీగా చేరుకుంటుండగా, ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన అనేక విషయాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై ఈ కమిషన్ దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం దీనిపై పలు ప్రశ్నలు లేవనెత్తడంతో విచారణ మొదలైంది.
ఇప్పటి వరకు కమిషన్ ముందుకు పలు అధికారులు, ఇంజినీర్లు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఇప్పుడు హరీష్ రావు విచారణకు హాజరై వివరాలు ఇచ్చిన నేపథ్యంలో, ఈ దర్యాప్తు మరింత దశలోకి ప్రవేశించనున్నట్లు భావిస్తున్నారు.
COMMENTS