ఇండీ కూటమి ప్రెస్‌మీట్‌ – ప్రధానికి ఎంపీల లేఖ విడుదల… - Digital Prime News - Latest Telugu News Digital Prime News

ఇండీ కూటమి ప్రెస్‌మీట్‌ – ప్రధానికి ఎంపీల లేఖ విడుదల…

Homeజాతీయం

ఇండీ కూటమి ప్రెస్‌మీట్‌ – ప్రధానికి ఎంపీల లేఖ విడుదల…

ఢిల్లీ: కేంద్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ‘ఆపరేషన్ సింధూర్’పై ఇంటి కూటమి (INDI Alliance) నేతలు మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వ

డీకే సీఎం ప్రమాణ స్వీకారం.. బెంగళూరులో ప్రతిపక్ష శక్తుల మహాసమ్మేళనం?
కాంగ్రెస్ చర్చలు మంత్రులపై అసంతృప్తి…..
ఢిల్లీ పర్యటనలో రేవంత్ – మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం…

ఢిల్లీ: కేంద్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ‘ఆపరేషన్ సింధూర్’పై ఇంటి కూటమి (INDI Alliance) నేతలు మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎంపీలు రాసిన లేఖను అధికారికంగా విడుదల చేయనున్నారు.
ఇండీ కూటమిలోని 200 మంది ఎంపీలు ఈ లేఖపై సంతకం చేసి, ఆపరేషన్ సింధూర్ అంశంపై చర్చించేందుకు వెంటనే పార్లమెంటరీ సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారు ప్రధానిని ప్రశ్నించనున్నారు.
ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రముఖ నేత దీపేందర్ హుడా హాజరుకానున్నారు. ఈ ప్రెస్‌మీట్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మరింత ఒత్తిడి తీసుకురావాలని ఇండీ కూటమి భావిస్తోంది.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube