తూ.గో గైట్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య…… - Digital Prime News - Latest Telugu News Digital Prime News

తూ.గో గైట్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య……

Homeఆంధ్రప్రదేశ్

తూ.గో గైట్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య……

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని గైట్ ఇంజినీరింగ్ కాలేజీలో విషాద ఘటన చోటుచేసుకుంది. హాస్టల్‌లో బీటెక్ విద్యార్థిని ప్రగతి ఉరేసుకుని ఆత్మహత

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు సీఎంను ఆహ్వానం
ఫ్రీ బస్‌పై YCP అసహనం మంత్రి మండిపల్లి
ఏపీ ఆన్‌లైన్ సేవలు తాత్కాలికంగా నిలిపివేత….

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని గైట్ ఇంజినీరింగ్ కాలేజీలో విషాద ఘటన చోటుచేసుకుంది. హాస్టల్‌లో బీటెక్ విద్యార్థిని ప్రగతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన విద్యార్థుల మధ్య తీవ్ర విషాదాన్ని నింపింది.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, పరీక్షల్లో నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో ప్రగతి తీవ్ర మనోవేదనకు లోనైంది. అదే కారణంగా ఆమె ఈ ఘటనకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. హాస్టల్ గదిలో ఆమె రాసిన సూసైడ్ నోట్‌ కూడా వెలుగులోకి వచ్చింది. “మానసిక క్షోభకు గురవుతున్నాను” అంటూ అందులో ప్రగతి పేర్కొనడం గమనార్హం.
విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మరింత సమాచారం కోసం కళాశాల అధికారులు మరియు సహచర విద్యార్థులను విచారిస్తున్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0
Follow by Email
YouTube
YouTube