కాళేశ్వరం విచారణపై రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఘాటు కౌంటర్.. - Digital Prime News

కాళేశ్వరం విచారణపై రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఘాటు కౌంటర్..

Homeతెలంగాణ

కాళేశ్వరం విచారణపై రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఘాటు కౌంటర్..

కాళేశ్వరం విచారణపై మేం భయపడం – హరీష్ రావు కౌంటర్. తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు మరోసారి ముద్దయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యా

కమిషన్ ఎదుట కేసీఆర్ – కాళేశ్వరం విచారణలో కీలక మలుపు!
తెలంగాణ భవన్ వద్ద హరీష్ రావు ఫ్లెక్సీలు తొలగింపు…..
హరీష్ రావుతో ముగిసిన కాళేశ్వరం కమిషన్ విచారణ……

కాళేశ్వరం విచారణపై మేం భయపడం – హరీష్ రావు కౌంటర్.
తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు మరోసారి ముద్దయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్రంగా స్పందించారు.
“కాళేశ్వరం కమిషన్ ముందు బీఆర్‌ఎస్ నేతలు భయపడుతున్నారు” అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనిపై హరీష్ రావు ఘాటు కౌంటర్ ఇచ్చారు. “ఎవడు చెప్పిండు నీకు మేము భయపడుతున్నామని? మేము తప్పకుండా విచారణకు వెళ్తాము. మీరు చేస్తున్న దుష్ప్రచారాన్ని బహిరంగంగా పటాపంచలు చేస్తాము” అంటూ ఘాటుగా స్పందించారు.
హరీష్ రావు మాట్లాడుతూ –
“మా పాలనలో ఏ తప్పు జరగలేదని, మీరు అధికారంలోకి వచ్చాక ప్రజల దృష్టిని మళ్లించేందుకు అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. మీ అజెండా తెలంగాణ ప్రజల సమస్యలు కాదు. కేవలం రాజకీయ ద్వేషంతో మాట్లాడుతున్నారు. విచారణ జరిగితే నిజాలు బయట పడతాయి. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లక్షల ఎకరాలకు నీరు అందింది. ఇది తెలంగాణ రైతుల కల. మీరు ఆ కలను తునాతునకలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు సత్యాన్ని తెలుసుకుంటారు” అన్నారు.
మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కమిషన్‌పై బీఆర్ఎస్ కూటమి అనుమానాలు వ్యక్తం చేస్తోంది. నిజంగా పారదర్శక విచారణ జరిగితే మేము సహకరిస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అధికార – ప్రతిపక్షాల మధ్య విమర్శల, ప్రతివిమర్శల పోరుతో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కేసుగా మారి రాజకీయంగా కీలక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube