కడప, మే 27: రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దేశంలో పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని కోరారు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు సభలో
కడప, మే 27: రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దేశంలో పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని కోరారు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు సభలో ఆయన ప్రసంగిస్తూ, అవినీతి నిర్మూలనకు ఇది కీలక అడుగుగా పేర్కొన్నారు.
డిజిటల్ కరెన్సీ ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తరించిన నేపథ్యంలో పెద్ద నోట్ల అవసరం లేదని, పెద్ద నోట్లు అవినీతి, అక్రమ లావాదేవీలకు ప్రధాన హేతువవుతున్నాయని వ్యాఖ్యానించారు.
ఈ మేరకు దేశవ్యాప్తంగా అవినీతికి కళ్లెం వేసే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తక్షణం పెద్ద నోట్లను రద్దు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
COMMENTS