కొబ్బరి ధరలు గగనానికి…. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

కొబ్బరి ధరలు గగనానికి….

Homeఆంధ్రప్రదేశ్

కొబ్బరి ధరలు గగనానికి….

ఆంధ్రప్రదేశ్ రైతులకు మంచి వార్త. కొబ్బరి ధరలు చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో భారీగా పెరిగాయి. రాష్ట్రంలోని అంబాజీపేట, కేరళలో అలెప్పీ, తమిళనాడులో పొల్లాచ

సింగపూర్ ప్రధాని‌తో చంద్రబాబు భేటీ.. ఏపీ అభివృద్ధిపై చర్చ
అమరావతి పనులపై ఎమ్మెల్యేల ప్రశ్నలు.. మంత్రి నారాయణ కీలక సమాధానాలు
రుషికొండ భవనాలకు ప్రైవేట్ ఎంట్రీ.. ఏపీటీడీసీ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రైతులకు మంచి వార్త. కొబ్బరి ధరలు చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో భారీగా పెరిగాయి. రాష్ట్రంలోని అంబాజీపేట, కేరళలో అలెప్పీ, తమిళనాడులో పొల్లాచీ లాంటి ప్రాంతాల్లో ఉత్పత్తి తగ్గిన నేపథ్యంలో కొబ్బరి ధర క్వింటాలుకు రూ.17,500కి చేరింది. ఇది మార్కెట్ రికార్డు అని వ్యాపారులు, రైతులు చెబుతున్నారు.
గత ఏడాది క్వింటాల ధర రూ.9,500గా ఉండగా, ఈ ఏడాది మార్చిలో రూ.14,000, ఏప్రిల్‌లో రూ.16,000 కాగా ప్రస్తుతం రూ.17,500కు పెరిగింది. ప్రస్తుతం పచ్చికొబ్బరి ధర వెయ్యికాయలపై రూ.14,000-14,500 మధ్య ఉండటంతో, రైతులు నేరుగా పచ్చికాయలను విక్రయిస్తున్నారు.
తమిళనాడులో దిగుబడి తగ్గడంతో ఏపీలో కొబ్బరి డిమాండ్ పెరిగింది. ఇక, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో కొబ్బరి తోటల్లో రైతులు కొత్తగా రిసార్టులు నిర్మించి పర్యాటకులను ఆకర్షిస్తున్నారు. ఈ రిసార్టుల్లో ప్రతి గది అద్దె ధర రోజుకు రూ.2,500గా ఉండగా, గెస్ట్ హౌస్ మొత్తం తీసుకోవాలంటే రూ.50,000 ఖర్చవుతుంది. ఈ మార్గంలో రైతులు పర్యాటక రంగాన్ని ఉపయోగించుకుని ఆదాయం పెంచుకుంటున్నారు.

websoft digital media – instagram post

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube