రాత్రి నిద్రకు ముందు ఇవి తింటే.. బరువు తగ్గడం ఖాయం! - Digital Prime News - Latest Telugu News Digital Prime News

రాత్రి నిద్రకు ముందు ఇవి తింటే.. బరువు తగ్గడం ఖాయం!

Homeలైఫ్ స్టైల్

రాత్రి నిద్రకు ముందు ఇవి తింటే.. బరువు తగ్గడం ఖాయం!

హైదరాబాద్: బరువు తగ్గించుకోవాలంటే పూటపొరుగున జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. సరైన ఆహారపు అలవాట్లతో కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు. ముఖ్యంగా రాత్రి నిద్రకు ము

బంగారం-వెండి ధరలు పెరుగుదల
ఎక్కువగా తిన్నాక కడుపుబడిక తగ్గించుకునే చిట్కాలు….
ప్రపంచ ఫ్యాటీ లివర్ సమస్య……

హైదరాబాద్: బరువు తగ్గించుకోవాలంటే పూటపొరుగున జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. సరైన ఆహారపు అలవాట్లతో కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు. ముఖ్యంగా రాత్రి నిద్రకు ముందు కొన్ని ఆహారాలు తీసుకోవడం ద్వారా బరువు తగ్గే ప్రక్రియకు బూస్ట్‌ ఇస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
బాదం గింజల్లో ప్రోటీన్, ఆరోగ్యకర కొవ్వులు, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఆకలిని అదుపులో ఉంచి బరువు తగ్గించడంలో సహాయపడతాయి.
పెరుగులో ఉన్న ప్రోబయోటిక్స్ జీర్ణశయనికి మేలు చేస్తాయి. కాల్షియం, ప్రోటీన్ వంటి పోషకాలు శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి.
హెర్బల్ టీలైన గ్రీన్ టీ, పెప్పర్‌మింట్, చమోమిలే టీలు జీవక్రియ మెరుగుపరచడమే కాకుండా నిద్రను కూడా మెరుగుపరుస్తాయి.
డార్క్ చాక్లెట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. మెగ్నీషియం నిద్రకు సహాయపడుతుంది.
అరటిపండు మెలటోనిన్‌ విడుదలకు తోడ్పడుతుంది. కండరాల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
కోడిగుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకలి తగ్గుతుంది. బరువు నియంత్రించవచ్చు.
ప్రోటీన్ షేక్‌లను నిద్రకు ముందు తీసుకుంటే కడుపు నిండిన భావన కలుగుతుంది. మసిలిన కండరాలకు బలాన్నిస్తుంది.
యాపిల్‌లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల తక్కువ కాలరీలతో కడుపు నిండిన భావన కలుగుతుంది. బరువు తగ్గే అవకాశాన్ని పెంచుతుంది.
ఈ ఆహారాలు తక్కువ కేలరీలతో, అధిక పోషక విలువలతో రాత్రి సమయంలో తినడానికి ఉత్తమమైనవి. నిద్రకు ముందు ఆకలి పడి ఏదైనా తినాలని అనిపించినప్పుడు ఇవే బెస్ట్ చాయిస్ అంటున్నారు నిపుణులు.

websoft digital media – instagram post

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube